Top
logo

డ్రంక్‌ అండ్‌ డ్రవ్‌ టెస్ట్‌లో యువతి బీభత్సం

X
Highlights

మహానగరంలో వీకెండ్ పార్టీ కల్చర్ విస్తరిస్తూ వస్తోంది. పబ్బులు, క్లబ్బుల పేరుతో పీకలదాక మద్యం సేవిస్తూ ...

మహానగరంలో వీకెండ్ పార్టీ కల్చర్ విస్తరిస్తూ వస్తోంది. పబ్బులు, క్లబ్బుల పేరుతో పీకలదాక మద్యం సేవిస్తూ చేజేతులా ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. డ్రంక్ అండ్ డైవ్ కేసులను అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా యువతి యువకుల్లో మార్పులు రావడం లేదు. పార్టీల పేరుతో ఫుల్లుగా మద్యం తాగి వాహనాలు నడుపుతూ తమతో పాటు ఎదుటి వారి ప్రాణాలను హరిస్తున్నారు. హైదరాబాద్‌లో నిన్న రాత్రి పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పలుచోట్ల యువతీ, యువతులు పట్టుబడ్డారు. పీకలదాకా మద్యం సేవించి పోలీసుల నుంచి తప్పించుకునేందుకు పలువురు చోట్ల యువతులు వాదులాటకు దిగారు. బ్రీత్ అనలైజర్ పరీక్షల నుంచి తప్పించుకునేందుకు నానా హంగామా చేశారు.

పోలీసుల డ్రంక్ డైవ్ నుంచి తప్పించుకునేందుకు వెళ్లి ప్రమాదానికి గురైన ఘటన బంజారాహిల్స్‌లో జరిగింది. కేబీఆర్ పార్క్ నుంచి పంజాగుట్ట వైపు వెళుతున్న యువకులు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అతి వేగంతో కారు నడిపారు. అప్పటికే మద్యం సేవించి ఉండటంతో వేగాన్ని నియంత్రించుకోలేక మసీదు సెంటర్ దగ్గర డివైడర్‌ను ఢీ కొట్టారు. దీంతో కారు పల్టీలు కొట్టింది. కారు ఎయిర్ బ్యాగులు తెరచుకోవడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న యువకులు కారు వదిలి పరారయ్యారు. కారులో మద్యం సీసాలు గుర్తించిన పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌గా గుర్తించారు. కారు నెంబర్ ఆధారంగా విచారణ జరపుతున్న పోలీసులు సీసీ పుటేజ్ పరిశీలిస్తున్నారు.

మరో వైపు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్న పోలీసులతో మద్యం మత్తులో ఉన్న పలువురు యువతులు వాదులాటకు దిగారు. కావాలనే తమకు బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహిస్తున్నారంటూ గొడవకు దిగారు. తమ ముందు నుంచి కెమెరాలు తీసేయాలంటూ చిందులు వేశారు. ఈ సందర‌్భంగా డ్రంక్ డైవ్‌ చేసిన 76 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు 32 కార్లు, 44 బైకులను సీజ్ చేశారు.

డ్రంక్ డ్రైవ్ నిరోధానికి ఎన్ని చర్యలు తీసుకుంటున్న ఫలితం లేకపోవడంతో పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ అర్ధరాత్రి దాటిన తరువాత నిర్వహిస్తున్న పబ్‌లపై దాడులు చేశారు. జూబ్లీహిల్స్‌లోని రోడ్ నెంబర్ 36లో పలు పబ్బులపై దాడులు చేసిన పోలీసులు నిర్ణిత సమయం దాటిన తరువాత కూడా నడుస్తున్న పబ్బులపై కేసులు నమోదు చేశారు. మద్యం సేవిస్తున్న బలవంతంగా బయటకు పంపి నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు.

Next Story