మందుబాబుపై పోలీసుల మమకారం.. ఇంతకీ ఏం చేశారంటే

x
Highlights

హైదరాబాద్ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లోని ఐదు చోట్ల ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్ డ్రైవ్ నిర్వహించారు. నిబంధనలు బేఖాతర్ చేస్తూ మద్యంతాగి...

హైదరాబాద్ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లోని ఐదు చోట్ల ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్ డ్రైవ్ నిర్వహించారు. నిబంధనలు బేఖాతర్ చేస్తూ మద్యంతాగి తూలుతున్న మందుబాబుకే కారు స్టీరింగ్ అప్పగించారు. పక్క సీట్లో ట్రాఫిక్ పోలీస్ కూర్చుని కోటీశ్వరుడిపై మమకారం
చూపించారు. పోలీసుల నిర్వాకంపై జనం విస్మయం చెందారు.

డ్రంకన్ డ్రైవ్ లో సంపన్నుడైన ఓ బడావ్యాపారి బెంజి కారు నడుపుతూ పోలీసులకు చిక్కాడు. మందుబాబుకు బ్రీత్ ఎనలైజర్ తో పరీక్షించగా 59 పాయింట్ల మద్యం తాగిన మోతాదుగా నమోదైంది. అతనిపై కేసు బుక్ చేశారు. కానీ కారును సీజ్ చేయలేదు. ఖరీదైన కారు కావడం బడా వ్యాపారికి అనుకూలంగా వ్యవహారిస్తే కాసులొస్తాయని కక్కుర్తిపడ్డారు. సీజ్ చేసిన కారును కానిస్టేబుల్ డ్రైవ్ చేయలేదు. డ్రంకన్ డ్రైవ్ లో దొరికిన తాగుబోతు కే కారు స్టీరింగ్ అప్పగించారు. మందుబాబు కారు నడుపుతుండగా ట్రాఫిక్ కానిస్టేబుల్ పక్కసీట్లో కూర్చొని పోలీసుస్టేషన్ కు వెళ్లిపోయాడు.

బెంజికారుని కానిస్టేబుల్ కు నడపడం రాదని ఓసారి తామే కారుని తీసుకెళ్లామంటూ మరో మారు చెబుతూ అసలు విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు పోలీసులు. కారు నడపడం రానప్పుడు అక్కడే నిలిపి ఉంచిన క్రేన్ తో కారుని తీసుకెళ్లకపోవడంలో ఆంతర్యమేంటో అంతుచిక్కని ప్రశ్నగా మారింది. పబ్బుల్లో గార్ల్ ఫ్రెండ్స్ తో కలిసి మందేసి చిందేసి కారు స్టీరింగ్ పట్టి రోడ్డెక్కారు కొందరు మద్యంరాయుళ్లు. డ్రంకన్ డ్రైవ్ లో 107 మంది మందుబాబులు పోలీసులకు చిక్కారు. 39 కార్లు, 68 బైకుల్ని సీజ్ చేశారు. తాగుబోతులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories