Top
logo

ప్రదీప్‌కు జైలు తప్పదా ?

ప్రదీప్‌కు జైలు తప్పదా ?1 / 8

న్యూ వేడుకలు సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వారికి జైలు శిక్ష తప్పదా ? డిసెంబర్‌ 31లోపు పట్టుబడితే జైలు శిక్ష తప్పదని పోలీసులు ముందే హెచ్చరించారు. అయినా మందుబాబులు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. మందు కొట్టి చిందులు వేశారు. కొంత మంది పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ప్రముఖ తెలుగు యాంకర్‌ ప్రదీప్‌ మోతాదుకు మించి మద్యం సేవించారు. బ్రీతింగ్‌ ఎనలైజర్‌లో 30పాయింట్లకు మించితే పోలీసులు జైలుకు పంపుతారు. ఈ నేపథ్యంలో యాంకర్ ప్రదీప్‌ డ్రంక్‌ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డారు. అలా ఇలా కాదు మోతాదుకు మించి 6 రెట్లు ఎక్కువ మందు కొట్టారు యాంకర్ ప్రదీప్‌. బ్రీతింగ్‌ ఎనలైజర్‌లో ప్రదీప్‌ 178 శాతం మందు కొట్టినట్లు తేలింది. ఈ నేపథ్యంలో ప్రదీప్‌కు ఎన్ని రోజులు జైలు శిక్ష పడుతుందన్న దానిపై సస్పెన్స్‌గా మారింది. గతంలో 170 పాయింట్లు నమోదైన లారీ డ్రైవర్‌కు 5 రోజులు జైలు శిక్ష విధించారు. దీంతో ప్రదీప్‌‌కు కూడా 5 రోజుల కంటే ఎక్కువ జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

Next Story