Top
logo

మావోల మెరుపుదాడి.. దూరదర్శన్ రిపోర్టర్, ఇద్దరు జవాన్లు మృతి

మావోల మెరుపుదాడి.. దూరదర్శన్ రిపోర్టర్, ఇద్దరు జవాన్లు మృతి
X
Highlights

ఎన్నికల వేళ ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. దంతేవాడ జిల్లాలో కూంబింగ్ బలగాలపై మెరుపు దాడులకు దిగారు. ...

ఎన్నికల వేళ ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. దంతేవాడ జిల్లాలో కూంబింగ్ బలగాలపై మెరుపు దాడులకు దిగారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లతో పాటు దూరదర్శన్ రిపోర్టర్ మృతి చెందగా మరో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. ఇరు వర్గాల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతూ ఉండటంతో ఘటనాస్థలికి అదనపు బలగాలను తరలించారు. తొలి విడత ఎన్నికల నామినేషన్ల ముగింపు రోజు నుంచి మావోయిస్టులు వరుసగా దాడులకు పాల్పడుతున్నారు. మూడు రోజుల క్రితం ఐదుగురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను హతమార్చిన మావోయిస్టులు ఆదివారం అర్ధరాత్రి బీజేపీ నేత నంద్ లాల్ ముదాంబీపై కత్తులతో దాడి చేశారు. తాజాగా ఈ ఘటన జరగడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.

Next Story