Top
logo

ధోనీ పై విమర్శలను తిప్పికొట్టిన విరాట్ కొహ్లీ

Highlights

టీమిండియా మాజీ కెప్టెన్, తన ప్రియస్నేహితుడు మహేంద్ర సింగ్ ధోనీ పైన వస్తున్న విమర్శలను కెప్టెన్ విరాట్ కొహ్లీ...

టీమిండియా మాజీ కెప్టెన్, తన ప్రియస్నేహితుడు మహేంద్ర సింగ్ ధోనీ పైన వస్తున్న విమర్శలను కెప్టెన్ విరాట్ కొహ్లీ గట్టిగా తిప్పికొట్టాడు. తిరువనంతపురం టీ-20 మ్యాచ్ లో టీమిండియా 6 పరుగుల విజయంతో సిరీస్ సొంతం చేసుకొన్న తర్వాత ధోనీ విమర్శకులపై కొహ్లీ విరుచుకుపడ్డాడు. ఒక్క వైఫల్యాన్ని భూతద్దంలో పెట్టి చూస్తూ ధోనీని విమర్శించడం, వెంటాడటం అన్యాయమని కొహ్లీ చెప్పాడు. తాను మూడుసార్లు విఫలమైనా ఒక్కరూ తనవైపు వేలెత్తి చూపలేదని అదే 35 ఏళ్ల వయసుదాటిన ధోనీని మాత్రం తప్పుపడుతున్నారని టీ-20 జట్టు నుంచి తప్పుకొని యువఆటగాళ్లకు అవకాశమివ్వమంటూ సలహా ఇస్తున్నారని గుర్తు చేశాడు. ఫిట్ నెస్ తో పాటు జట్టు విజయాలలో ప్రధానపాత్ర వహిస్తున్న ధోనీని వేలెత్తి చూపాల్సిన అవసరమే లేదని టీమిండియా కెప్టెన్ తేల్చి చెప్పాడు.

Next Story