logo
జాతీయం

ఛాలెంజ్‌ పేరుతో రోడ్లపై డ్యాన్స్‌ చేస్తే జైలుకే...

ఛాలెంజ్‌ పేరుతో రోడ్లపై డ్యాన్స్‌ చేస్తే జైలుకే...
X
Highlights

కికీ ఛాలెంజ్‌. ప్రపంచ వ్యాప్తంగా ఇదో కొత్త ట్రెండ్‌. మన మెట్రో సిటీస్‌ యూత్‌‌నీ కికీ ఛాలెంజ్‌ ఊపేస్తోంది. ఈ...

కికీ ఛాలెంజ్‌. ప్రపంచ వ్యాప్తంగా ఇదో కొత్త ట్రెండ్‌. మన మెట్రో సిటీస్‌ యూత్‌‌నీ కికీ ఛాలెంజ్‌ ఊపేస్తోంది. ఈ డ్యాన్స్‌ ఫీవర్‌ బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌కు పాకింది. కదులుతున్న కారులోంచి అకస్మాత్తుగా దిగేసి కారుతోపాటే రోడ్డు మీద వెళ్తూ ‘ఇన్‌ మై ఫీలింగ్స్‌’ సాంగ్‌‌కు స్టెప్పులేయడం అలా డ్యాన్స్‌ చేస్తూ మళ్లీ అదే కారులో ఎక్కేయడం. ఇదే ప్రపంచాన్ని ఊపేస్తున్న కికీ డ్యాన్స్‌ ఛాలెంజ్‌. ‘కికీ డాన్స్‌ చాలెంజ్‌’ పేరుతో ప్రపంచవ్యాప్తంగా వైరల్‌ అవుతున్న తాజా ట్రెండ్‌ ఇది. షిగ్గీ అనే కమెడియన్‌ ఈ ట్రెండ్‌కు ఆద్యుడు. కెనడియన్‌ గాయకుడు డ్రేక్‌ పాడిన ‘ఇన్‌ మై ఫీలింగ్స్‌’ అనే పాటకు అతడు చేసిన డ్యాన్స్‌ వీడియోతో కికీ ఛాలెంజ్‌ ట్రెండ్‌ మొదలైంది.

ఆ వీడియో చూసి ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఇలా డ్యాన్స్‌ చేయడం మరికొందరికి సవాల్‌ విసరడం మొదలుపెట్టారు. టాలీవుడ్‌ హీరోయిన్లు రెజీనా, ఆదా శర్మ, ఐటం గాళ్‌ నోరా ఫతేహి కికీ డ్యాన్స్‌ చాలెంజ్‌ వీడియోలు తీసి నెట్‌లో పెట్టడంతో సామాన్యులూ వారిని ఫాలో అవుతున్నారు. కికీ ఛాలెంజ్‌ మత్తులో డ్యాన్సులు చేస్తూ చేస్తూ కొందరు స్తంభాలకు, ఇతర వాహనాలకు ఢీకొని గాయాలపాలవుతున్నారు. అయినా, ఈ చాలెంజ్‌ ట్రెండ్‌ కొనసాగుతోంది. ఇంకా మన దగ్గర అంత విస్తృతంగా ప్రచారం కాలేదుగానీ ఢిల్లీ, ముంబై, జైపూర్‌, బెంగళూరు, చండీగఢ్‌ లాంటి మెట్రో సిటీస్‌లో కికీ డ్యాన్స్‌ ఛాలెంజ్‌ ఫుల్‌ పాపులర్‌ అయ్యింది.

కికీ డ్యాన్స్‌ ఛాలెంజ్‌పై హైదరాబాద్‌ పోలీసులు అలర్ట్‌ అయ్యారు. కార్ల నుంచి దిగి రోడ్లపై ఎక్కడపడితే అక్కడ డ్యాన్స్‌ చేస్తూ న్యూసెన్స్‌‌ క్రియేట్‌ చేస్తే చర్యలు తప్పవని వార్నింగ్‌ ఇస్తున్నారు. కికీ మత్తులో రోడ్లపై డ్యాన్స్‌ చేయడం ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్‌ రోడ్లపై కికీ డ్యాన్స్‌ చేస్తే కేసులు పెడతామని ట్రాఫిక్‌ పోలీసులు వార్నింగ్‌ నోటీస్‌ జారీ చేశారు. దీంతో ఈ ట్రెండ్‌ను అనుసరించి గాయాలపాలు కావొద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఢిల్లీ పోలీసులైతే.. ‘రోడ్ల మీద చేసే నృత్యాలు మీకు కొత్త (నరక) ద్వారాలు తెరుస్తాయి’ అని.. ‘డాన్స్‌ ఫ్లోర్‌ మీద చెయ్యాలి, రోడ్ల మీద కాదు’ అని ట్వీట్‌ చేస్తున్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేశారు.

Don’t Take Up Kiki Challenge: Hyderabad Police Tell YouthÂ

Next Story