Top
logo

ఇవాంకకు తండ్రి ప్రశంసలు

ఇవాంకకు తండ్రి ప్రశంసలు
X
Highlights

ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో ఇవాంకా స్పీచ్ కు ఆమె తండ్రి డోనాల్డ్ ట్రంప్ కూడా ఖుషీ అవుతున్నారు. ఆమె...

ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో ఇవాంకా స్పీచ్ కు ఆమె తండ్రి డోనాల్డ్ ట్రంప్ కూడా ఖుషీ అవుతున్నారు. ఆమె స్పీచ్ ను ట్వీట్ చేస్తూ ట్రంప్ గ్రేట్ వర్క్ ఇవాంకా అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. జీఈఎస్‌లో మొదటి రోజు సదస్సుకు వచ్చిన ప్రతినిధులను ఉద్దేశించి ఇవాంకా మాట్లాడారు. మహిళలు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకునే విధంగా తమ ప్రభుత్వం విధానాలను రూపొందిస్తున్నదని ఇవాంకా ఆ ప్రసంగంలో పేర్కొన్నారు. వర్క్‌ఫోర్స్, స్కిల్ డెవలప్‌మెంట్ కోసం అమెరికా ప్రభుత్వం అనేక విధానాలను అమలు చేస్తున్నదని ఆమె అన్నారు. తమ కలలను తమ భవిష్యత్తుగా మార్చుకునేందుకు మహిళా వ్యాపారవేత్తలకు సహాకారం అందిస్తున్నామని ఇవాంకా ఆ ప్రసంగంలో తెలిపారు. హైదరాబాద్ లో రెండో రోజు జరుగుతున్న సమావేశంలో కూడా ఇవాంకా వివిధ దేశాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. మంత్రి కేటీఆర్ సంధానకర్తగా వ్యవహరించిన ఈ సమావేశంలో ఇవాంకా స్పీచ్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

Next Story