Top
logo

వేదికపై ప్రసంగిస్తూనే కోటు విప్పేసిన ట్రంప్‌

Highlights

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు తన మాటలతో వార్తల్లో నిలవడం అలవాటే కానీ తాజాగా మాటలతో కాదు తన చర్యలతో...

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు తన మాటలతో వార్తల్లో నిలవడం అలవాటే కానీ తాజాగా మాటలతో కాదు తన చర్యలతో వార్తల్లోకెక్కాడు. ట్రంప్ ఆసియా పర్యటన సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. జపాన్‌లోని యోకొటా ఎయిర్‌బేస్‌లో ప్రసంగించిన ఆయన వేదికపై మాట్లాడుతుండగానే సడెన్‌గా తాను వేసుకున్న సూట్ జాకెట్‌ విప్పేసారు. ట్రంప్ చర్యతో అందరూ అవాక్కయి చూస్తుండగానే పక్కనే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఆయనకు బాంబర్ జాకెట్‌ను అందించారు. వెంటనే ట్రంప్ దానిని ధరించారు. అరికాను తక్కువ అంచనా వేయొద్దంటూ ఉత్తరకొరియాకు పరోక్ష హెచ్చరికలు చేస్తున్న సమయంలోనే ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.

Next Story