గుండెపోటు వచ్చిన వ్యక్తిని కాపాడిన కుక్క

గుండెపోటు వచ్చిన వ్యక్తిని కాపాడిన కుక్క
x
Highlights

మాడ్రిడ్‌లో ఓ పోలీస్ డాగ్ తెలివి చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. అది తన ట్రైనర్ పాలిట సేవరే (రక్షకురాలే) అయింది. ఎక్సర్ సైజు సందర్భంగా హఠాత్తుగా కింద...

మాడ్రిడ్‌లో ఓ పోలీస్ డాగ్ తెలివి చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. అది తన ట్రైనర్ పాలిట సేవరే (రక్షకురాలే) అయింది. ఎక్సర్ సైజు సందర్భంగా హఠాత్తుగా కింద పడిపోయిన అతగాడు మరణించాడేమోననుకుని పరుగున వచ్చి అతడ్ని సేవ్ చేసేందుకు నానా పాట్లూ పడింది. మ్యాడ్రిడ్ పోలీసులు ఓ కుక్కకు గుండెపోటు బారిన పడిన వారి ప్రాణాలు కాపాడేలా ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. సీపీఆర్ చేయడంలో దానికి ఇచ్చిన ట్రైనింగ్‌ను పరీక్షించారు పోలీసులు. ఈ నేపథ్యంలో..ట్రైనర్ శిక్షణలో భాగంగా కావాలనే గుండె పోటు వచ్చినట్టు కుప్పకూలగానే.. దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిన శునకం అతడి ఛాతి మీద ముందు కాళ్లతో బాదింది. తర్వాత అతడు శ్వాస తీసుకుంటాన్నాడో లేదో తెలుసుకోవడం కోసం చెవిని అతడి ముక్కు దగ్గరగా ఉంచింది. మళ్లీ అతడి ఛాతీని గట్టిగా కాళ్లతో బాదుతూ సీపీఆర్ చేసింది.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆపదలో వున్న మనిషి ప్రాణాలను కాపాడేలా శిక్షణ పొందిన శునకాన్ని చూసి అందరూ మెచ్చుకుంటున్నారు. ‘ ఈ కుక్క తన విశ్వాసానికి మరో ఖ్యాతిని ఆపాదించుకుంది. ఇది చాలా గ్రేట్ కుక్క ’ అంటూ కామెంట్లలో ఆ కుక్కపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు.

Show Full Article
Print Article
Next Story
More Stories