కుక్క VS పాము...తల్లి శునకంపైకి పామును ఊసిగొల్పిన స్థానికులు

కుక్క VS పాము...తల్లి శునకంపైకి పామును ఊసిగొల్పిన స్థానికులు
x
Highlights

ఒడిషాలోని భద్రక్‌లో విషాదం చోటు చేసుకుంది. కుక్క పిల్లలను భారీ నాగుపాము కాటేసింది. పాముకాటుకు కుక్క పిల్లలు మృతి చెందాయి. తల్లి శునకాన్ని కూడా పాము...

ఒడిషాలోని భద్రక్‌లో విషాదం చోటు చేసుకుంది. కుక్క పిల్లలను భారీ నాగుపాము కాటేసింది. పాముకాటుకు కుక్క పిల్లలు మృతి చెందాయి. తల్లి శునకాన్ని కూడా పాము కాటేసేందుకు ప్రయత్నం చేస్తుండగా స్థానికులు కాపాడారు.
భద్రక్ లో కొద్ది రోజుల క్రితం ఓ శునకం పిల్లలను కనింది. రాత్రి వేళ కుక్క పిల్లల వద్దకు భారీ నాగు పాము వచ్చింది. పాము దాడి నుంచి పిల్లలను తల్లి శునకం అడ్డుకుంది. కాసేపటికి పాము మళ్లీ బుసలు కొట్టింది. కుక్క ఎదురుతిరగడంతో పాము వెనుదిరిగే ప్రయత్నం చేసింది. అయితే, ఈ దృశ్యాలను సెల్ ఫోన్ లో బంధిస్తున్నస్థానికులు పామును మళ్లీ శునకంపైకి ఊసిగొల్పారు.

మళ్లీ కుక్క పిల్లల వద్దకు చేరుకున్న పాము పలు కుక్క పిల్లలను కాటేసింది. పాము కాటుకు మూడు కుక్క పిల్లలు అక్కడికక్కడే మృతి చెందాయి. తర్వాత తల్లి శునకంపైకి దాడికి యత్నించింది. శునకం గట్టి అరుపులతో పామును నిలువారించే ప్రయత్నం చేస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. ఆ తర్వాత పామును స్నేక్ క్యాచర్ పట్టుకున్నాడు. భారీ పాముతో విన్యాసాలు చేస్తుండగా స్థానికులు భయంతో కేకలు వేశారు. పాముతో కాసేపు ఆడుకున్న తర్వాత స్నేక్ క్యాచర్ దాన్ని బంధించాడు. తర్వాత పామును అటవీ ప్రాంతంలో వదిలేశాడు. కుక్క పిల్లలను పాము కాటు నుంచి స్థానికులు కాపాడే ప్రయత్నం చేయలేదు. పైగా తల్లి శునకంపైకి పామును రెచ్చగొట్టారు. కుక్క, పాము లడాయిని తమాషా చూసినట్లు చూశారు. ఈ దృశ్యాలను సెల్ ఫోన్ లో బంధించి వెర్రి ఆనందం పొందారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories