కుక్క వర్సెస్‌ నాగుపాము

కుక్క వర్సెస్‌ నాగుపాము
x
Highlights

నాగుపాము, కుక్క మధ్య జరిగిన విరోచిత పోరాటం వైరల్‌గా మారింది. కర్ణాటకలోని హోళెమక్కి గ్రామానికి సమీపంలో ఉన్న ఒక తోటలో కుక్కకు, నాగుపాముకు మధ్య పెద్ద...

నాగుపాము, కుక్క మధ్య జరిగిన విరోచిత పోరాటం వైరల్‌గా మారింది. కర్ణాటకలోని హోళెమక్కి గ్రామానికి సమీపంలో ఉన్న ఒక తోటలో కుక్కకు, నాగుపాముకు మధ్య పెద్ద గొడవే జరిగింది. అవినాశ్‌ అనే వ్యక్తికి చెందిన తోటలో సుమారు అరగంట పాటు సాగిన కీచులాటలో నాగుపాము రోషంతో పడగవిప్పి బుసకొడుతూ కుక్కను ఎదుర్కొంది. తన జోలికి రావద్దని నాగుపాము కుక్కను బెదిరిస్తూ పొదల్లోకి జారుకుంది.

పెంపుడు కుక్క గట్టిగా అరవడంతో అప్రమత్తమైన అవినాశ్ కుటుంబసభ్యులకు అక్కడికి వెళ్లి చూడగా అరుదైన దృశ్యం కంటపడింది. బంగారు వర్ణంలో మెరిసిపోతూ పడగ విప్పిన పాము భానుడి కిరణాల వెలుగులో మరింత ప్రకాశించడం ఆశ్యర్యానికి గురిచేసింది. ఆ అరుదైన పాముకు సంబంధించిన దృశ్యాలను తమ సెల్‌ఫోన్లలో బంధించారు. ఈ విషయం కాస్త స్థానికులకు తెలియడంతో అది అలాంటి ఇలాంటి సర్పం కాదని అద్భుత శక్తులున్న పాము అని స్థానికులు చెవులు కొరుక్కుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories