logo
జాతీయం

స‌మ్మెబాట ప‌ట్టిన 2.9ల‌క్ష‌ల మంది డాక్ట‌ర్లు

స‌మ్మెబాట ప‌ట్టిన 2.9ల‌క్ష‌ల మంది డాక్ట‌ర్లు
X
Highlights

దేశ‌వ్యాప్తంగా డాక్ట‌ర్ల స‌మ్మెకొన‌సాగుతుంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) పిలుపు మేరకు డాక్ట‌ర్లు ఆందోళ‌న ...

దేశ‌వ్యాప్తంగా డాక్ట‌ర్ల స‌మ్మెకొన‌సాగుతుంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) పిలుపు మేరకు డాక్ట‌ర్లు ఆందోళ‌న బాట‌ప‌ట్టారు. కేంద్ర ప్రభుత్వం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ బిల్లును వ్య‌తిరేకిస్తూ దేశ వ్యాప్తంగా ఉన్న డాక్ట‌ర్లు ఉద‌యం 6గంట‌ల నుంచి సాయంత్రం 6గంట‌ల పాటు విధుల్ని బ‌హిష్క‌రించారు. ఇదిలా ఉంటే మెడికల్ కమిషన్ బిల్లులో ఉన్న క్రాస్‌పథిని డాక్టర్లు వ్యతిరేకిస్తున్నారు. క్రాస్‌పథి అంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్ చదవిన వారు కూడా అలోపతి ట్రీట్‌మెంట్ ఇవ్వడం. ఈ బిల్లు ప్ర‌వేశ‌పెడితే ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు ప్రస్తుత బిల్లుతో పర్మిషన్ మరింత సులువు కానున్నదని ఐఎంఏ జాతీయ కార్యదర్శి డాక్టర్ జయేశ్ లీల్ తెలిపారు. అండర్‌గ్రాడ్యువేట్, పోస్ట్ గ్రాడ్యువేట్ సీట్లను కూడా పెరుగుతాయ‌ని..దీనివ‌ల్ల కాలేజీల్లో ఏదైనా లోపం జరిగితే, వాటిపై చర్యలు తీసుకునే వెసలుబాటు లేదన్నారు. కాబ‌ట్టే ఈ బిల్లును వ్య‌తిరేకిస్తు 2.9ల‌క్ష‌ల‌మంది స‌మ్మెబాట ప‌ట్టార‌ని సూచించారు. ప్రైవేటు కాలేజీల్లో సుమారు 60 శాతం సీట్ల ఫీజులను కూడా కాలేజీలే డిసైడ్ చేసుకునే వీలును కల్పిస్తున్నారు. మెడికల్ కమిషన్ బిల్లును ఇవాళ లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు.


Next Story