మీకు కారుందా? గ్యాస్‌ సబ్సిడీ ఉండకపోవచ్చు...

మీకు కారుందా? గ్యాస్‌ సబ్సిడీ ఉండకపోవచ్చు...
x
Highlights

ముందు ఆధార్‌తో లింక్‌ అయితేనే గ్యాస్‌ అన్నారు. తరవాతే నగదు బదిలీ అన్నారు. బ్యాంక్‌ అకౌంట్‌ ఉన్నోళ్లకే నగదు బదిలీ అన్నారు. బ్యాంక్‌ అకౌంట్‌కి ఆధార్‌...

ముందు ఆధార్‌తో లింక్‌ అయితేనే గ్యాస్‌ అన్నారు. తరవాతే నగదు బదిలీ అన్నారు. బ్యాంక్‌ అకౌంట్‌ ఉన్నోళ్లకే నగదు బదిలీ అన్నారు. బ్యాంక్‌ అకౌంట్‌కి ఆధార్‌ లింక్‌ చేయాలన్నారు. మొత్తానికి మొత్తంగా గ్యాస్‌ సబ్సిడీకి తిరుమంగళం పాడే దిశగా కేంద్రం పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా కారుంటే నో గ్యాస్‌ అంటున్నారు.

కారుంటే గ్యాసుండదా? అంటే కిరసనాయిల్‌పై వంట చేస్కోవాలా అని గాబరా పడకండి. కారున్నా గ్యాసు సప్లై ఉంటుంది. సబ్సిడీ ఉండదంతే. గ్యాస్ సబ్సిడీలపై ప్రభుత్వాలకు ఎప్పుడో కన్ను పడింది. ముందుగా అధార్‌తో అనుసంధానం అన్నారు. ఆధార్‌తో అనుసంధానం కాని 3.6 కోట్ల గ్యాస్‌ కనెక్షన్లను రద్దు చేశారు. తరువాత నగదు బదిలీ అన్నారు. బ్యాంక్‌ అకౌంట్‌ ఉన్నోళ్లకే సబ్సిడీ రిటర్న్‌ కావడంతో అప్పట్లో గ్యాస్‌ వినియోగదారులు గగ్గోలెత్తారు. అక్కడా బ్యాంక్‌ అకౌంట్‌కి ఆధార్ అనుసంధానం తప్పని సరి చేశారు. గ్యాస్‌ సబ్సిడీ భారాన్ని నెమ్మదిగా తగ్గించుకొనే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం నెమ్మదిగా జోరు పెంచుతోంది. కారు ఉండడాన్ని క్రైటేరియాగా ముందుకు తీసుకొచ్చారు. కారు ఓనర్ల డిటేయిల్స్‌ని ఆర్టీయే ఆఫీసుల నుంచి తెప్పించుకున్నారు. దేశంలో మొదట కొన్ని జిల్లాల్లో పైలెట్‌ ప్రాజెక్టు కింద కారు ఓనర్‌కి గ్యాస్‌ కనెక్షన్‌ కట్‌ చేసే ప్రక్రియ ప్రారంభించనున్నారు.

అయితే ఈ రోజుల్లో చాలా మంది మధ్యతరగతి ప్రజలు తమకు అంత ఆదాయం లేకపోయినా కారు మీద మోజు కొద్దీ కొంటున్నారు. ఇటీవల కార్ల విక్రయాలు కూడా గణనీయంగా పెరిగిపోయాయి. బ్యాంకులిచ్చే ఆటో లోన్ల ద్వారా కార్లు కొంటుంటారు. ఈ కారణంతోనే కారున్నరోంతా రిచ్‌ పీపుల్‌ కాదని తేలుతోంది. కారుందనే సాకుతో గ్యాస్‌ సబ్సిడీ కట్‌ చేయడం ఏ మాత్రం సబబనే ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు వస్తాయనే ముందుగా ఉహించిన కేంద్ర ప్రభుత్వం కారు ఉండడానికి ఒక కొలమానంగా తీసుకొని ఆపైన వారికి వార్షిక ఆదాయం పది లక్షలు ఉందా లేదా అని చూస్తున్నారు. అయితే ముందుగా కారు ఉండడాన్నే ప్రమాణంగా తీసుకొని వారికి గ్యాస్‌ సబ్సిడీ తొలగిస్తారు. ఆ తరువాత ఆ విధంగా గ్యాస్‌ సబ్సిడీ తొలగించిన కారు ఓనరు తనకు పది లక్షల ఆదాయం లేదని నిరూపించుకోవాలి. అప్పుడే గ్యాస్‌ సబ్సిడీ పునరుద్దరణ జరుగుతుంది. అలా నిరూపించుకోలేకపోతే కేవలం కారున్నదన్న ఒకే ఒక కారణంతో గ్యాస్‌ సబ్సిడీని కోల్పోనున్నాడు.

ఇవన్నీ కాకుండా స్వచ్ఛందంగా గ్యాస్‌ సబ్సిడీ వదులకోవడంమనే ప్రచారం ద్వారా కూడా సబ్సిడీ భారాన్ని భారీగానే ప్రభుత్వం తగ్గించుకొంటోంది. అయితే భవిష్యత్‌లో పది లక్షల కొలమానం అయిదు లక్షలకు తగ్గదనే గ్యారెంటీ కూడా ఏమీ లేదని పరిశీలకులు భావిస్తున్నారు. బీపీఎల్‌ కుటుంబాలకే గ్యాస్ సబ్సిడీ అనే పరిస్థితి కూడా రావొచ్చంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories