Top
logo

సీఎం కేసీఆర్‌పై డీకే అరుణ ఎదురుదాడి

సీఎం కేసీఆర్‌పై డీకే అరుణ ఎదురుదాడి
X
Highlights

పాలమూరు జిల్లా అభివృద్ధికి కాంగ్రెస్ నేతలు అడ్డుపడుతున్నారంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై గద్వాల ఎమ్మెల్యే...

పాలమూరు జిల్లా అభివృద్ధికి కాంగ్రెస్ నేతలు అడ్డుపడుతున్నారంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ తీవ్ర స్ధాయిలో స్పందించారు. ప్రాజెక్టుల అంచనాలను పెంచి కమీషన్ల కొల్లగొడుతున్న కేసీఆర్‌, హరీష్‌రావులకు తమను విమర్శించే అర్హత లేదన్నారు. మంత్రి హరీష్‌‌రావు అవినీతి వల్లే కల్వకుర్తి లిఫ్ట్ పనులు ఆగిపోయాయంటూ అరుణ ఆరోపించారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చకుండా జిల్లా ప్రజలను మోసం చేసిన సీఎం కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలంటూ ఆమె డిమాండ్ చేశారు. ఎన్నికలు వస్తున్నప్పుడే గట్టు ప్రాజెక్టు గుర్తుకు వచ్చిందా ? అంటూ ఆమె ప్రశ్నించారు. మహబూబ్ నగర్‌ ఎంపీగా ఉన్నప్పుడు జిల్లాకు కేసీఆర్ ఏం చేశారో చెప్పాలన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాను విమర్శిస్తున్న కేటీఆర్‌ ... ఆమె వల్లే తమ కుటుంబం అధికారంలో ఉందన్న విషయం గుర్తుంచుకోవాలంటూ సూచించారు.

Next Story