logo
సినిమా

ఆమే ఒప్పకుంటే 'గాడ్, సెక్స్ అండ్ ట్రూత్' సినిమా తీస్తా

X
Highlights

'ఎన్‌హెచ్ 47లో బూత్ బంగ్లా' అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న అజయ్ కౌండిన్య తాజాగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి...

'ఎన్‌హెచ్ 47లో బూత్ బంగ్లా' అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న అజయ్ కౌండిన్య తాజాగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సినిమా ఇండస్ట్రీ మీద, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సీనియర్ నటి రోజా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద సంచలన కామెంట్స్ చేశారు. దీంతో పాటు నటి గాయిత్రి గుప్తా మీద కూడా ఫైర్ అయ్యారు.

రోజా గారు మా అమ్మలాంటి వారు, సీనియర్ యాక్టర్... ఆమెకు మా పాదాభివందనం. శాసన సభ్యురాలుగా ఉన్నారు. ఆమె ప్రపంచంలో ఉన్న ప్రతి సమస్య గురించి మాట్లాడతారు. కానీ మా సినిమా ఫీల్డ్ గురించి మాట్లాడరు. మా సమస్యల గురించి మాట్లాడరు. ఆమె ఇండస్ట్రీ వారి కోసం ఎలాంటి సహాయం చేసింది లేదు, ఆమెకు మాకు సహాయం చేయడం చేతకాదు. రామ్ గోపాల్ వర్మ విదేశీ ఆర్టిస్టును పెట్టి సినిమా తీశారు. విదేశీ ఆర్టిస్టును పెట్టే బదులు రోజా గారిని పెట్టి తీస్తే సూపర్ గా ఉండేది. ఇప్పటి కైనా రోజా గారు ఒప్పుకుంటే గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ పార్ట్ 2 సినిమా తీస్తాను.... అంటూ అజయ్ కౌండిన్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

సినీ పరిశ్రమ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో చేస్తుంటే... సినిమాటోగ్రఫీ మంత్రి మాత్రం ఎలాంటి చలనం లేకుండా ఉన్నారని అజయ్ మండిపడ్డారు. ఈ మూడేళ్ల కాలంలో ప్రభుత్వానికి సినీరంగం రూ. 600 కోట్ల ట్యాక్స్ కట్టిందని... కానీ, కేసీఆర్ అనౌన్స్ చేసిన ఏ ఒక్క పనీ అమలుకు నోచుకోలేదని అన్నాడు. ఈ సమస్యను తలసాని దృష్టికి తీసుకెళ్లే... యూసుఫ్ గూడ చెక్ పోస్టు వద్ద ఉన్న చిన్న శ్రీశైలంయాదన్ కలవమని మాకు సలహా ఇచ్చాడని... మినిస్టర్ గా ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడతాడా అని ప్రశ్నించాడు.

వపన్ కల్యాణ్ పై కూడా కౌండిన్య మండిపడ్డాడు. ఎన్నో సమస్యలపై ప్రశ్నించే పవన్... సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రశ్నించరా అని నిలదీశారు. కేసీఆర్ కు క్షమాపణలు చెప్పుకోవడానికే ఆయన ఇంటికి పవన్ వెళ్లారని చెప్పాడు. ఒక ఆడ, మగా తేడా తెలియని ఓ అమ్మాయి గురించి మాట్లాడతానని... ఆమె గాయత్రి గుప్తాఅని కౌండిన్య తెలిపారు. సినీపరిశ్రమలో అమ్మాయిలను నిర్మాత, దర్శకులు వాడుకుంటారని ఆమె ఓ టీవీలో మాట్లాడుతూ చెప్పిందని మండిపడ్డారు. సినీ పరిశ్రమలో జరిగేది ఏందో తెలిసి కూడా ఇలాంటి విషయాలు మాట్లాడతావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Next Story