నిజాం మ్యూజియంలో ధూమ్ సినిమా చూపించిన దొంగలు

నిజాం మ్యూజియంలో ధూమ్ సినిమా చూపించిన దొంగలు
x
Highlights

మనం అప్పుడప్పుడు సినిమాల్లో మ్యూజియాల్లో జరిగే దొంగతనాలు చూస్తుంటాం . అప్పట్లో ధూమ్ సినిమాలో హృతిక్ రోషన్ ఒక వజ్రం కోసం మ్యూజియంలో చేసిన దొంగతనాన్ని...

మనం అప్పుడప్పుడు సినిమాల్లో మ్యూజియాల్లో జరిగే దొంగతనాలు చూస్తుంటాం . అప్పట్లో ధూమ్ సినిమాలో హృతిక్ రోషన్ ఒక వజ్రం కోసం మ్యూజియంలో చేసిన దొంగతనాన్ని చూసి,అబ్బా అసలు ఇలా జరుగుతుందా అని అనుకోని వారు ఉండరు.మొన్నటికి మొన్న లింగా సినిమాలో రజనీకాంత్ కూడా ఇదే పని చేశాడు.కానీ ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న నిజాం మ్యూజియంలో అచ్చు సినిమాల్లో జరిగినట్టే దొంగతనం జరిగింది.

పక్కా ప్లాన్ చేసిన దొంగలు వజ్రాలు పొదిగిన డబ్బా..గోల్డ్ స్పున్.కప్పు సాసర్ ను దొంగలించి జంప్ అయిపోయారు. వజ్రాలు పొదిగిన డబ్బా..గోల్డ్ స్పున్,కప్పు సాసర్ ను దొంగలించినట్టుగా మ్యూజియం సిబ్బంది ఎప్పటికో గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఎప్పటిలాగే కేసునమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు. సినిమాల్లో లాగా చేజింగ్లు చేయకపోయిన సిసి కెమెరా ఆధారంగానే లభించిన క్లూస్ ను ఉపయోగించి దొంగలను పట్టుకుంటాం అని పోలీసులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories