logo
జాతీయం

డిసెంబర్11.. గల్లీ..ఢిల్లీ హీటెక్కే వేళ..

డిసెంబర్11.. గల్లీ..ఢిల్లీ హీటెక్కే వేళ..
X
Highlights

ఇక మూడంటే మూడే రోజుల గడువు మిగిలి ఉంది డిసెంబర్ 11కి. అరోజు ఆశమాశీ రోజు కాదు ఐదు రాష్ట్రాలలో హోరాహోరి ఎన్నికల...

ఇక మూడంటే మూడే రోజుల గడువు మిగిలి ఉంది డిసెంబర్ 11కి. అరోజు ఆశమాశీ రోజు కాదు ఐదు రాష్ట్రాలలో హోరాహోరి ఎన్నికల రణక్షేత్రంలో విజేతలెవరో పరాజితులెవరో తేలిపోయే సమయం విచ్చేస్తుంది. ఫలితలపై ఉత్కంఠగా అందరూ చూపే కాదు గల్లీని ఢిల్లీని హీటెక్కించేది కూడా అదే రోజు. ఎందుకంటే డిసెంబర్ 11న ఇటు పార్లమెంట్ సమావేశాలు, మరో వైపు ఎన్నికల ఫలితాలు అరోజే కావడంతో అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు వెళుతున్న తరుణంలో మరోవైపు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానుండటంతో ఇక అందరి చూపు డిసెంబర్ 11పై కన్నుపడింది. కాగా తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మిజోరాం ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 11న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ సర్కారుకు ఈ ఎన్నికలు సెమీఫైనల్ గా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. డిసెంబర్ 11న ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాలు వచ్చే ఏడాది జనవరి 10 వరకు జరుగనున్నాయని సమాచారం.

Next Story