Top
logo

టీఆర్ఎస్ అంటే.. తెలంగాణ రౌడీ సమితి

టీఆర్ఎస్ అంటే.. తెలంగాణ రౌడీ సమితి
X
Highlights

తెలంగాణ అమరుల గురించి మాట్లాడే అర్హత టీఆర్ఎస్ నేతలకు లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్...

తెలంగాణ అమరుల గురించి మాట్లాడే అర్హత టీఆర్ఎస్ నేతలకు లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ విమర్శించారు. అమరుల కుటుంబాలకు ఎన్నో హామీలు గుప్పించిన కేసీఆర్... వాటిని అమలు చేయకుండా దగా చేశారన్నారు. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పని చేసిన వారికి పదవులు కట్టబెట్టిన ఘనత కేసీఆర్‌కు ఉందని దాసోజు శ్రవణ్ గుర్తు చేశారు. టీఆర్‌ఎస్‌ అంటే తెలంగాణ రౌడీల పార్టీ అని ఆరోపించారు. తెలంగాణ గౌరవాన్ని ఆంధ్ర కాంట్రాక్టర్లకు తాకట్టుపెట్టారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ జాతి, నీతి లేని పార్టీ అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏ అమరులు చెప్తే మహేందర్‌ రెడ్డికి, తుమ్మల నాగేశ్వరరావుకి మంత్రి పదవులిచ్చారని ప్రశ్నించారు.

Next Story