logo
జాతీయం

దంగల్ నటిపై లైంగిక వేధింపులు..

దంగల్ నటిపై లైంగిక వేధింపులు..
X
Highlights

ఎన్ని చట్టాలున్నా పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అమ్మాయిలపై వేధింపులు ఆగడం లేదు. మృగాళ్లు రెచ్చిపోతూనే...

ఎన్ని చట్టాలున్నా పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అమ్మాయిలపై వేధింపులు ఆగడం లేదు. మృగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. పోకిరీలు సెలబ్రెటీలను వదిలిపెట్టడం లేదు. రోడ్లు, బస్సులు, బైక్‌లపైనే కాదు ఆఖరికి ఫ్లైట్లలోనూ వేధింపులకు పాల్పడుతున్నారు. దంగల్ నటి జైరా వసీమ్‌పై సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ప్రకంపనలు సృష్టిస్తోంది.

జైరా వసీమ్‌ ఢిల్లీ నుంచి ముంబై వెళ్లేందుకు ఫ్లైట్‌ ఎక్కింది. జైరా వెనుక సీట్లో కూర్చున్న ప్రయాణికుడు పదే పదే ఇబ్బంది పెట్టాడు. ఢిల్లీ నుంచి ముంబై వరకు కాళ్లతో,చేతులతో ఆమెను తాకాడు. ఫ్లైట్‌లో వేధింపులపై జైరా వసీమ్ కన్నీటి పర్యంతమయ్యారు. ఫ్లైట్‌లో వేధింపులపై సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేసింది. ఎదురైన వేధింపుల వివాదం సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడంతో ముంబై పోలీసులు స్పందించారు. జైరా వసీమ్‌ను ప్రత్యేకంగా కలిసిన ముంబై పోలీసులు ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసి కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం.

Next Story