logo
సినిమా

విమానంలో ‘దంగల్’ నటి జైరాకు వేధింపులు

విమానంలో ‘దంగల్’ నటి జైరాకు వేధింపులు
X
Highlights

ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా, కఠిన చర్యలు తీసుకుంటున్నా అమ్మాయిలపై వేధింపులు ఆగడం లేదు. మృగాళ్లు రెచ్చిపోతూనే...

ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా, కఠిన చర్యలు తీసుకుంటున్నా అమ్మాయిలపై వేధింపులు ఆగడం లేదు. మృగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. పోకిరీలు సెలబ్రిటీలను సైతం వదిలిపెట్టడం లేదు. రోడ్లు, బస్సులు, బైక్ లపైనే కాదు...ఆఖరికి ఫ్లైట్లలోనూ వేధింపులకు పాల్పడుతున్నారు. దంగల్ నటి జైరా వసీమ్ పై సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ప్రకంపనలు సృష్టిస్తోంది.
విమానాల్లో వేధింపులు ఈమధ్య సర్వసాధారణంగా మారిపోయాయి. కామన్‌ పీపుల్‌కే కాదు... సెలబ్రిటీలకు కూడా వేధింపులు తప్పడం లేదు. తాజాగా దంగల్‌ మూవీ ఫేమ్‌ జైరా వసీమ్‌‌కు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. సహచర ప్రయాణికుడు ఆమెను లైంగికంగా వేధించాడు. ఫ్లైట్‌ ఎక్కినప్పటి నుంచి దిగేవరకూ అసభ్యంగా ప్రవర్తించాడు. దాంతో వేధింపులపై జైరా వసీమ్ కన్నీటి పర్యంతమైంది. ఎలా వేధించాడో వివరిస్తూ సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేసింది.
ఢిల్లీ నుంచి ముంబై వెళ్లేందుకు విస్తారా ఫ్లైట్‌ ఎక్కిన జైరాను వెనుక సీట్లో కూర్చున్న ప్రయాణికుడు పదేపదే ఇబ్బంది పెట్టాడు. ఫ్లైట్‌ ఎక్కినప్పటి నుంచి దిగేవరకూ కాళ్లూచేతులతో జైరాను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు.
వేధింపులను సోషల్ మీడియా ద్వారా జైరా బయటపెట్టడంతో విస్తారా ఎయిర్‌లైన్స్ వెంటనే స్పందించి.... విచారణ మొదలుపెట్టింది. తమ ఎయిర్‌లైన్స్‌లో ఇలాంటి ప్రవర్తనను సహించబోమన్న... విస్తారా.... జైరాకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ప్రకటించింది. అయితే జైరాతో అసభ్యంగా ప్రవర్తించిన యువకుడ్ని... ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Next Story