logo

డ్యాన్స్ చేస్తూ.. కుప్పకూలిన విద్యార్థిని

డ్యాన్స్ చేస్తూ.. కుప్పకూలిన విద్యార్థిని

తమ పాఠశాలలో ఏర్పటుచేస్తున్న ఓ కార్యక్రమంలో తన డ్యాన్స్ రిహార్సల్స్‌ చేస్తుండగా ఓ బాలిక తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రికి తరలిస్తుండుగా బాలిక అనంతలోకాలకు వెళ్లిపోయింది. ఇక వివరాల్లోకి వెళితే హైదరాబాద్ - శామీర్ పేట మండలం, జగ్గన్ గూడకు చెందిన అనూన్య మజీద్‌పూర్‌లో గల జైన్‌ హేరిటేజ్‌ బడిలో ఎనిమిదవ తరగతి చదువుతోంది. తమ పాఠశాలలో ఓ కార్యక్రమానికి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుండగా ఒక్కసారిగా అస్వస్థతకు గరై ఒక్కసారిగా కుప్పకూలింది. దింతో హుటాహుటీనా బాలిక తలిదండ్రులకు సమాచారం అందించి దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించే క్రమంలోనే బాలిక మృతిచెందింది. ఆసుపత్రి చేరిన తలిదండ్రులు తీవ్ర శ్లోకంలో మునిగిపోయారు దింతో ఆగ్రహించిన తలిదండ్రులు శవాన్ని బాలిక చదువుతున్న బడిలోకి తీసుకొచ్చి ఆందోళన చేపట్టారు. తమ బాలిక చావపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని విలపించారు. వెంటనే విచారణ జరిపించాలని బాధితురాలి తలిదండ్రులు డిమాండ్ చేశారు. దింతో హుటాహుటినా పాఠశాలకు చేరుకున్న పోలీసులు ఘటనపై పిర్యాదుచేపట్టి దర్యాప్తు చేపడతామన్నారు.

chandram

chandram

Our Contributor help bring you the latest article around you


లైవ్ టీవి

Share it
Top