Top
logo

సొంత గూటికి డీఎస్...ఈనెల 11న...

సొంత గూటికి డీఎస్...ఈనెల 11న...
X
Highlights

బహిరంగ లేఖతో టీఆర్ఎస్ అధిష్టానానికి సవాల్ విసిరిన రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్ కాంగ్రెస్‌లో చేరేందుకు...

బహిరంగ లేఖతో టీఆర్ఎస్ అధిష్టానానికి సవాల్ విసిరిన రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్ కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఢిల్లీ కాంగ్రెస్ నేతలతో మంతనాలు జరుపుతున్నట్టు ఊహగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మానససరోవర్ యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ .. ఈ నెల 11న తిరిగి రానున్నారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు సమాచారం. ఇదే సమయంలో టీఆర్ఎస్‌లో తనకు అవమానం జరిగిందని భావిస్తున్న డీఎస్ ... తెలంగాణ అసెంబ్లీ రద్దు చేసిన తరువాత ప్రెస్‌ మీట్‌ నిర్వహించాలని భావిస్తున్నారు. డీఎస్‌ రాకను సీనియర్లతో పాటు జిల్లా నేతలు కూడా స్వాగతిస్తున్నట్టు సమాచారం.

Next Story