logo
సినిమా

వివాదాల్లో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’

వివాదాల్లో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’
X
Highlights

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై టీడీపీలో వ్యతిరేకత మొదలయ్యింది....

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై టీడీపీలో వ్యతిరేకత మొదలయ్యింది. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించిన తర్వాత చోటు చేసుకున్న సంఘటనలతో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు వర్మ. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సంచలనం సృష్టించిన వర్మ వెన్నుపోటు పాట ఫస్ట్ లుక్ గా సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఈ పాటపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ టీడీపీ నేతలు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. కొన్నాళ్ళ క్రితం టాలీవుడ్‌లో ఎన్టీఆర్ బ‌యోపిక్ రూపొందించేందుకు పలువురు ద‌ర్శ‌కులు క‌స‌ర‌త్తు చేశారు. దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ బయో పిక్ ను సెట్స్ పైకి తీసుకెళ్లి జనవరి 9న కథానాయకుడు చిత్రాన్ని రిలీజ్ చేస్తుండగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ఎంటరైన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు ఈ చిత్రంలో హైలెట్ చేయనున్నారు.

ఎన్టీరామారావును ఏపీ సీఎం చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన విధంగా విడుదల చేసిన వెన్నుపోటు పాట తెలుగు తమ్ముళ్లకు రుచించడం లేదు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి రాంగోపాల్ వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబును అవమానించే విధంగా ఆయన కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా పాటను రూపొందించారంటూ ఫిర్యాదు చేశారు. ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రానికి సంబంధించిన ‘వెన్నుపోటు’ పాటపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలుగుతమ్ముళ్ల ఆందోళన చేయడంపై ఆ సినిమా దర్శకుడు రాంగోపాల్‌ వర్మ స్పందించాడు. వైస్రాయ్‌ హోటల్లో జరిగింది వెన్నుపోటేనని ఎన్టీఆరే చాలా సార్లు చెప్పారని, తానేం కొత్తగా కల్పించలేదన్నాడు. తనకు ఎవరీ మీద కోపం, ప్రేమ లేదన్నాడు. ఎన్టీఆర్‌ జీవితంలో జరిగిందే నిజాయితీగా చూపిస్తానని, తనకు ఎవరీ మద్దతు అవసరంలేదంటూ ట్వీట్ చేశారు వర్మ. మరో వైపువర్మ విడుదల చేసిన వెన్నుపోటు పాటకు విశేష ఆదరణ లభిస్తోంది. ఈ పాటను చూసిన నెటిజన్లు సోషల్‌ మీడియా వేదికగా వర్మపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం తెరకెక్కిన తర్వాత అభిమానులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

Next Story