రాచకొండ కమిషనరేట్ లో తగ్గిన నేరాలు

x
Highlights

రాచకొండ కమిషనరేట్ లో క్రైమ్ రేటు కాస్త తగ్గింది. గత ఏడాదితో పోలిస్తే ఈఏడాది 6శాతం తగ్గింది. ఫిర్యాదులు పెరిగినా టెక్నాలజీతో పరిష్కారం చూపారు. ఇటు...

రాచకొండ కమిషనరేట్ లో క్రైమ్ రేటు కాస్త తగ్గింది. గత ఏడాదితో పోలిస్తే ఈఏడాది 6శాతం తగ్గింది. ఫిర్యాదులు పెరిగినా టెక్నాలజీతో పరిష్కారం చూపారు. ఇటు ప్రజలు, అటు పోలీసు సిబ్బంది సహకారంతో క్రైమ్ రేటు తగ్గించగలిగామంటున్నారు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ . రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది నేరాలు కాస్తా తగ్గాయి. ఫిర్యాదులు పెరిగినా వాటికి పరిష్కారాలు చూపుతూ ముందుకెళుతున్నారు పోలీసులు. కేసుల దర్యాప్తు, రికవరీలలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కొద్దిగా పెరిగాయి. మహిళల అక్రమ రవాణా, చిన్న పిల్లలతో వ్యభిచారం, దోపిడీలు, దొంగతనాలు , హత్యాయత్నాలు, వేధింపులు, సైబర్ క్రైమ్ వంటి నేరాలు రాచకొండను వణికించాయి.

షీ టీమ్స్ మహిళలకు భరోసా కల్పిస్తున్నాయి. 2017లో 677 కేసులు నమోదు కాగా ఈ ఏడాది 663 కేసులు నమోదయ్యాయి. అందులో 277 పెట్టీ కేసులు ఉన్నాయి. షీ టీమ్స్ చేతిలో పట్టుబడిని వారిలో గత ఏడాది ఈ ఏడాది దాదాపు సేమ్ గా ఉంది. 2017లో మహిళలను వేధిస్తూ మైనర్లు 84, మేజర్లు 593 మంది షీటీమ్స కు దొరకకగా ఈ ఏడాది 46 మంది మైనర్లు, 617 మంది మేజర్లు అడ్డంగా బుక్కయ్యారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి దోపిడీలు కూడా బాగా పెరిగాయి. 2017లో 86 దోపిడీ కేసులు, దొంగతనాలు 73 అయ్యాయి. గత ఏడాదితో పోలీస్తే ఈ ఏడాది చైన్ స్నాచింగ్ లు కేసులు తగ్గాయి. గత ఏడాది 64, ఈ ఏడాది 61 చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇళ్లల్లో చోరీలు 774 కేసులు నమోదు అయ్యాయి. ఇక అటెన్షన్ డైవర్షన్ కేసులు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పెరిగాయి. 2017లో 63 కేసులు నమోదు కాగా ఈ ఏడాది 95కి పెరిగింది. ఇందులో 37 కేసులకు మాత్రమే పరిష్కారం చూపారు.

రాచకొండను రోడ్డు ప్రమాదాలు వణికిస్తూనే ఉన్నాయి. ఒక్క 2017లోనే 2,367 కేసులు నమోదుకాగా అందులో 619 మంది ప్రమాదాల్లో మృతి చెందారు. 2,692 మంది గాయపడ్డారు. 2018లో రోడ్డు ప్రమాదాలు 2,773 జరిగాయి. అందులో 694 మంది చనిపోయారు. ఔటర్ రింగ్ రోడ్డుపై ఈ ఏడాది 34 ప్రమాదాలు జరగగా అందులో 20 మంది మృతి చెందారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 5,692 కేసులు నమోదు కాగా. 897 మంది మందుబాబులను జైలుకు పంపించారు పోలీసులు. ఈసారి డ్రగ్స్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. చెడ్డి గ్యాంగ్ మాత్రం పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. ప్రత్యేక బృందాలు ఆ గ్యాంగ్ ను అరెస్టు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories