కూటమి వీడే ప్రసక్తే లేదు: చాడ వెంకట్ రెడ్డి

x
Highlights

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కోరినన్ని సీట్లు ఇవ్వకపోతే ఒంటరిగా పోటీ చేస్తామంటూ అనేకసార్లు కాంగ్రెస్‌కు అల్టిమేటం...

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కోరినన్ని సీట్లు ఇవ్వకపోతే ఒంటరిగా పోటీ చేస్తామంటూ అనేకసార్లు కాంగ్రెస్‌కు అల్టిమేటం ఇచ్చిన చాడ ఇప్పుడు కూటమితోనే ముందుకెళ్తామని స్ఫష్టం చేశారు . కేసీఆర్‌‌ను గద్దె దించాలంటే కొంత సర్దుబాటు ధోరణి తప్పదన్నారు. కూటమి ముందు 9 స్థానాలను ఉంచామని కాంగ్రెస్‌ మాత్రం 3 సీట్లు ఇస్తామంటోందని, కానీ తమకు కనీసం 5 స్థానాలను కేటాయించాలని కోరుతున్నట్లు తెలిపారు. సంఖ్యతోపాటు తాము కోరుతున్న స్థానాలనే ఇవ్వాలని చాడ డిమాండ్ చేస్తున్నారు. సీట్ల సర్దుబాటుపై తమ జాతీయ నాయకత్వం కాంగ్రెస్‌ అధిష్టానంతో మాట్లాడుతోందంటున్న చాడ వెంకట్‌రెడ్డి వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories