యూపీ గోవులకు రేడియం పట్టీలు

యూపీ గోవులకు రేడియం పట్టీలు
x
Highlights

రాత్రివేళల్లో రోడ్లపైకి వచ్చి పశువులు ప్రమాదంలో చనిపోవడం, గాయాలనుండి నిర్మూలించడానికి యూపీ సర్కార్ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ ప్రమాదాలను...

రాత్రివేళల్లో రోడ్లపైకి వచ్చి పశువులు ప్రమాదంలో చనిపోవడం, గాయాలనుండి నిర్మూలించడానికి యూపీ సర్కార్ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ ప్రమాదాలను నివారించేందుకు గోవులు సహా ఇతర పశుగణాల కొమ్ములు, మెడకు రేడియం పట్టిలు అమర్చే ప్రక్రియ చేపట్టారు.ఈ టెపులుకు మెరిసే గుణం వల్ల వాహనదారులకు పశువులను దూరం నుంచే గుర్తించేందుకు వీలుంటుంది.

రాత్రి వేళల్లో రోడ్లపైకి వచ్చే పశువులు సహజంగానే ప్రమాదాలకు గురవుతుంటాయి. చలికాలంలో అయితే ఈప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ప్రమాదాల బారి నుండి రక్షించేందుకు ఈ రేడియం హెడ్ బ్యాండ్‌లు అమరుస్తున్నాం' అని ఎస్‌పీ ధర్మవీర్ సింగ్ మీడియాకు వెల్లడించారు. చలికాలంలో మంచు ప్రభావంతో రోడ్లపై దృశ్యం స్పష్టంగా లేకనే తరచు ప్రమాదాలు జరుగుతుంటాయని, ఆ దృష్ట్యా వెంటనే తము ఈ నిర్ణయాన్ని అమల్లోకి తీసుకువచ్చామని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories