ఏడాదిగా బాత్రూంలోనే వారి నివాసం... ఎందుకంటే?

ఏడాదిగా బాత్రూంలోనే వారి నివాసం... ఎందుకంటే?
x
Highlights

కర్నాటకలోని తుమకూరుకు చెందిన ఓ వృద్దజంట తమ బంధువుల ఇంట్లోని బాత్రూంలో ఏడాదిగా కాలంగా నివసిస్తూన్నారు. సర్కారు ఇళ్ల నిర్మాణంలో తీవ్ర జాప్యం...

కర్నాటకలోని తుమకూరుకు చెందిన ఓ వృద్దజంట తమ బంధువుల ఇంట్లోని బాత్రూంలో ఏడాదిగా కాలంగా నివసిస్తూన్నారు. సర్కారు ఇళ్ల నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతోనే వారు ఈ వినూత్ననిరసన వ్యక్తం చేస్తున్నారు. ఓబులప్ప(55) అతని భార్య లక్ష్మీనరసమ్మ(45) తుమకూరు పరిధిలోని కదపాలకేర గ్రామంలో అత్యంత దుర్ఘంధ పూరిత వాతావరణంలో ఉంటున్నారు. వీరికి ఏడాదిక్రితం బీఆర్ అంబేద్కర్ నివాస్ యోజన కింద ఇళ్లు మంజూరైంది కాగా పునాదుల వరకూ నిర్మాణం కూడా అయ్యింది. ఆతరువాత ప్రభుత్వ లబ్ధి అందక ఇంటి నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. దీంతో అదే ప్రాంతంలో ఉంటున్న వారి బంధువుల ఇంట్లోని బ్రాత్రూంలో వీరు నివాసం కొనసాగిస్తున్నారు.

వీరి ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం నుంచి రూ. 1.64 లక్షలు మంజూరు కాగా ఈ మొత్తాన్ని, నిర్మాణాన్ని అనుసరించి విడతలవారీగా అందజేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పటివరకూ వీరికి ప్రభుత్వం నుంచి నయాపైసా కూడా అందలేదు. ఈ సందర్బంగా ఓబులప్ప మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ చేయూత అందకనే మేము బాత్రూంలోనే ఉంటున్నాం. అనారోగ్యం నన్ను తీవ్ర్గంగా బాధిస్తోంది. నేను ఏ పనీ చేయలేకపోతున్నా అని బాధితుడు ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితుడు వేడుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories