logo
జాతీయం

దేశ సరిహద్దుల్లో తుపాకుల మోత

దేశ సరిహద్దుల్లో తుపాకుల మోత
X
Highlights

దేశ సరిహద్దు ఉత్తర కశ్మీర్ జిల్లా గుర్జ్ లోయలోని నానే సెక్టార్ వద్ద మిలిటెంట్లు చొరబాటుకు ప్రయత్నించడంతో భారత...

దేశ సరిహద్దు ఉత్తర కశ్మీర్ జిల్లా గుర్జ్ లోయలోని నానే సెక్టార్ వద్ద మిలిటెంట్లు చొరబాటుకు ప్రయత్నించడంతో భారత సైన్యం వారిని అడ్డుకుంది. ఈ క్రమంలో వారి మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. మంగళవారం ఉదయం సరిహద్దు ప్రాంతం తుపాకుల మోతతో దద్దరిల్లిపోయింది. ఉగ్రవాదుల దాడిలో ఆర్మీ మేజర్ కేపీ రాణే, సైనికులు హవాల్ దార్స్ జమై సింగ్, విక్రమ్ జీత్, రైఫిల్ మన్, మణిదీప్ మృతి చెందారు.

అయితే సైన్యం జరిపిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులను హతమార్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మొత్తం ఎనిమిదిమంది చొరబాటుకు ప్రయత్నించారు. ప్రస్తుతం సెర్చ్ ఆఫరేషన్ కొనసాగుతున్నట్లు సైన్యం ప్రకటించింది. మరింత సమాచారం అందాల్సి ఉంది. దేశంలోకి చొరబాట్లను సహించమని రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇదివరకే ప్రకటించారు

Next Story