నాపేరు సూర్య.. హాలీవుడ్ కాపీనా?

టాలీవుడ్ లో ఎప్పుడు లేని విధంగా ఈ మధ్య కాపీ అనే పదం బాగా వినిపిస్తోంది. పెద్ద దర్శకులు రచయితలే అలాంటి...
టాలీవుడ్ లో ఎప్పుడు లేని విధంగా ఈ మధ్య కాపీ అనే పదం బాగా వినిపిస్తోంది. పెద్ద దర్శకులు రచయితలే అలాంటి పొరపాట్లు చేస్తుండడంతో చిత్ర పరిశ్రమపై నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. గత ఏడాది డ్రగ్స్ వివాదం ఎలా అయితే టాలీవుడ్ కు మచ్చ తెచ్చిందో ఇప్పుడు కాపీ అనే పదం కూడా విమర్శలకు బాస్ ఇస్తోంది. గత కొంత కాలంగా ఈ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నా ఎక్కువగా హైలెట్ కాలేదు. కానీ ఎప్పుడైతే అజ్ఞాతవాసి ఫ్రెంచ్ మూవీ ఆధారంగా తెరకెక్కిందని వార్తలు వచ్చాయో అప్పటి నుంచి నెక్స్ట్ సినిమాలు కూడా అదే తరహాలో రాబోతున్నట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం అల్లుఅర్జున్-అను ఇమ్మాన్యుయేల్ జంటగా టాలీవుడ్‌లో రానున్న మూవీ ‘నాపేరు సూర్య’. వక్కంతం వంశీ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ ఫిల్మ్ గురించి లేటెస్ట్ న్యూస్. ఈ చిత్రం.. హాలీవుడ్ కాపీయేనంటూ సోషల్‌మీడియాలో ప్రచారం జోరందు కుంది. 2002లో వచ్చిన ‘యాంట్వోన్ ఫిషర్’ మూవీలో ఓ యువకుడు చిన్నతనంలోనే హింసాత్మకంగా మారుతాడు. ఆ తర్వాత పరిస్థితుల నేపథ్యంలో నేవీలో జాయిన్ అవుతాడు..తోటి ఉద్యోగులపైనే దాడి చేస్తాడు. చివరకు పైఅధికారి సలహా మేరకు ఆ యువకుడు సైకాలజిస్ట్‌ని సంప్రదిస్తాడు.
ఇక ‘నాపేరు సూర్య’ కూడా ‘యాంట్వోన్ ఫిషర్’కి దగ్గరగా వుందని అంటున్నారు. బన్నీ రోల్ కూడా సేమ్ అని, కాకపోతే ఆర్మీమేన్‌గా హీరో కనిపిస్తాడని చెబుతున్నారు. మరి ఈ వార్తలపై యూనిట్ ఏమంటుందో చూడాలి. ఈ కామెంట్లను బన్నీ అభిమానులు తోసిపుచ్చుతున్నారు. కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టారు. ‘అజ్ఞాతవాసి’ కాపీ అయినంత మాత్రాన తమ హీరో నటించిన మూవీ.. హాలీవుడ్ కాపీ అనడానికి ఆధారాలేంటని ప్రశ్నిస్తున్నారు. మరి ఈ యవ్వారానికి తెరపడాలంటే ‘నాపేరు సూర్య’ రిలీజయ్యేవరకు ఆగాల్సిందేనని అంటున్నారు.
Afghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMT
Diabetics: మధుమేహ వ్యాధిగ్రస్థులకు ఈ జ్యూస్ దివ్యఔషధం..!
21 May 2022 12:00 PM GMTMLC Kavitha: రచ్చబండ కొచ్చే కాంగ్రెస్ నాయకులకు అభివృద్ధి చూపించండి
21 May 2022 11:30 AM GMTSweat: వేసవిలో చెమట ఎక్కువగా పడుతుందా.. ఈ చిట్కాలు పాటించండి..!
21 May 2022 11:00 AM GMTఅఖిలేశ్ యాదవ్‌తో ముగిసిన సీఎం కేసీఆర్ భేటీ
21 May 2022 10:52 AM GMTకేన్స్ లో 'రాకెట్రీ' ప్రివ్యూ..మాధవన్‌పై ఏఆర్ రెహమాన్ ప్రశంసలు
21 May 2022 10:28 AM GMT