Top
logo

జైల్లో తిన్న చిప్పకూడు సాక్షిగా కేసీఆర్ ...: రేవంత్

X
Highlights

అంతా మంచి జరిగితే మళ్లీ వస్తా.. లేకుంటే జైల్లో నుంచి నామినేషన్ వేస్తా.. మీ మీద నమ్మకంతోనే కోస్గీ నుంచి...

అంతా మంచి జరిగితే మళ్లీ వస్తా.. లేకుంటే జైల్లో నుంచి నామినేషన్ వేస్తా.. మీ మీద నమ్మకంతోనే కోస్గీ నుంచి హైదరాబాద్ వెళ్తున్నా అంటూ కార్యకర్తలకు చెప్పారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి. కొడంగల్‌ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన ఇంటిపై ఐటీ సోదాలు జరుగుతున్న విషయం తెలుసుకుని హైదరాబాద్ బయల్దేరారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ తొడగొట్టి చెబుతున్నా జైల్లో నుంచి ప్రచారం చేసుకున్నా 50వేల మెజార్టీతో కొడంగల్‌లో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు రేవంత్.

ఢిల్లీలో మోడీ, గల్లీలో కేసీఆర్ తనపై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు రేవంత్‌రెడ్డి. తనను ఓడించేందుకు 100 కోట్లతో ఓ ముఠా కొడంగల్ దిగింది. కేసీఆర్‌పై పోరాడుతున్నందుకే ఓటుకు నోటు కేసులో తనను ఇరికించారన్నారు. జైల్లో తిన్న చిప్పకూడు సాక్షిగా కేసీఆర్ కుటుంబ పాలనను అంతం చేస్తానని చెప్పారు రేవంత్. కేసీఆర్, మోడీ కుట్రల కారణంగా నేను కోస్గీలో మాట్లాడే మాటలు చివరి ఎన్నికల ప్రచారం కావొచ్చని చెప్పారు రేవంత్.

Next Story