కరీంనగర్‌ కాంగ్రెస్‌ కాక పుట్టింది... ఇప్పడంతా వలసలపర్వం

కరీంనగర్‌ కాంగ్రెస్‌ కాక పుట్టింది... ఇప్పడంతా వలసలపర్వం
x
Highlights

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ షాక్ తగలనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో కనీసం ఐదు స్దానాల్లో గెలుస్దామనుకున్న కాంగ్రేస్ ఒకస్దానానికే...

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ షాక్ తగలనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో కనీసం ఐదు స్దానాల్లో గెలుస్దామనుకున్న కాంగ్రేస్ ఒకస్దానానికే పరిమితమైపోయింది. ఈ షాక్ లోనే కాంగ్రేస్ కి ఇప్పుడు ఓ సీనియర్ నేత పార్టీ మారుతుండటంతో మరో షాక్ తగలనుంది. కాంగ్రేస్ పార్టీలో సీనియర్ గా ఉన్న ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ సిఎం కేసిఆర్ ని కలవడం ఒక్కసారిగా కరీంనగర్ జిల్లా కాంగ్రేస్ లో సంచలనంగా మారిపోయింది. గత ఎన్నికల్లో కాంగ్రేస్ అభ్యర్ది పొన్నం ప్రభాకర్ ను గెలిపిస్తామంటు పార్టీలో కీలకంగా వ్యవహారించిన ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ ఇప్పుడు సిఎంని కలిశారు. దీంతో ఇక ఆయన పార్టీ మారడం లాంఛనమేనంటూ జిల్లా కాంగ్రేస్ క్యాడర్ లో చర్చ జరుగుతోంది.

ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ కాంగ్రేస్ సీనియర్ నేత విహెచ్ కి అత్యంత సన్నిహితుడు. శాసనసభ్యుల కోటాలో ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. రానున్న మార్చితో ఆయన పదవికాలం ముగియనుంది. సంతోష్ కుమార్ కు కరీంనగర్ జిల్లాలో అన్ని వర్గాలతో సన్నిహత సంబందాలు ఉన్నాయి. కాని ఇప్పుడు ఆయన కేసీఆర్ ను కలవడంతో పార్టీ మారడం ఇక ఫిక్స్ అయినట్టే అని తెలుస్తోంది. సిఎంని కలిసిన సమయంలోను అభివ్రద్దిలో కలిసి పనిచేద్దామని చెప్పినట్టు సమాచారం. ఆయన అదికారికంగా పార్టీ మారుతున్నట్టు ప్రకటించకపోయినప్పటికి అది ఇక లాంఛనమే అని తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories