కాంగ్రెస్ నిరాహార దీక్ష ఇదేనా?... బీజేపీ సంచలన ఫోటో..

కాంగ్రెస్ నిరాహార దీక్ష ఇదేనా?... బీజేపీ సంచలన ఫోటో..
x
Highlights

దేశవ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా.. ఇవాళ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశాలతో అన్ని...

దేశవ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా.. ఇవాళ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశాలతో అన్ని రాష్ట్రాల పీసీసీలు.. ఆందోళనలు చేపట్టాయి. మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా రాజ్‌ఘాట్ వద్ద కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరాహార దీక్షను భారతీయ జనతా పార్టీ ఎద్దేవా చేసింది. నిరాహార దీక్ష ముందు కాంగ్రెస్ నేతలు ఓ హోటల్‌లో ఫూటుగా తిన్నారంటూ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మదన్ లాల్ ఖురానా తనయుడు, బీజేపీ నేత హరీష్ ఖురానా ఓ ఫోటోను పోస్ట్ చేసారు. ఈ ఫోటోలో రెస్టారెంట్‌లో అల్పాహారం తీసుకుంటున్న అజయ్ మాకెన్, హరూన్ యూసుఫ్, అర్విద్ సింగ్ లవ్వీ తదితరులున్నారు. రాజ్‌ఘాట్ వద్ద నిరాహార దీక్ష చేయమని పిలుపునిచ్చిన కాంగ్రెస్ నేతలు రెస్టారెంట్ లో హాయిగా కడుపునింపుకొంటున్నారంటూ హరీష్ ఖురానా ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

కాగా, బీజేపీ ట్వీట్, ఫోటోపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. అరవింద్‌ సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ... తాము చేసేది ఒక్కరోజు దీక్ష అని, ఈ రోజు ఉదయం 10.30 నుంచి సాయత్రం 4.30 వరకు ఉంటుందని, తాము ఉదయం 8 గంటల ముందే తప్పేంటని అన్నారు. బీజేపీ నేతలు దేశాన్ని సమర్థవంతంగా పాలించే అంశంపై దృష్టి పెట్టకుండా, తాము ఏం తింటున్నామనే విషయంపై దృష్టి పెట్టారని విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories