Top
logo

కేసీఆర్‌‌ది ఫ్రంట్‌ కాదు టెంట్‌

కేసీఆర్‌‌ది ఫ్రంట్‌ కాదు టెంట్‌
X
Highlights

కేంద్రంలో మళ్లీ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందన్నారు జైపాల్‌రెడ్డి. వచ్చే ఎన్నికల్లో మోడీ ఓటమి ఖాయమని జోస్యం...

కేంద్రంలో మళ్లీ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందన్నారు జైపాల్‌రెడ్డి. వచ్చే ఎన్నికల్లో మోడీ ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. కేసీఆర్‌‌ ఫ్రంట్‌పై సెటైర్లు పేల్చిన జైపాల్‌... అది ఫ్రంట్‌ కాదు టెంట్‌ అన్నారు. కేసీఆర్‌... మోడీ ఏజెంట్‌ అన్నారు. 2019లో టీఆర్‌ఎస్‌ ఓటమి ఖాయమన్న జైపాల్‌రెడ్డి... కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీల రక్షణ కోసం తీసుకువచ్చిన అత్యాచారాల నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేసే ఆలోచన బీజేపీ మనసులో ఉందని జైపాల్‌రెడ్డి అన్నారు. అయితే నేరుగా ధైర్యం చేయలేక.. సుప్రీంకోర్టు ద్వారా చేసేలా పథకం ప్రకారం వ్యవహరించిందని కరీంనగర్‌లో ఆరోపించారు. బీజేపీపై కేసీఆర్‌ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని.. ఎన్నికలత తర్వాత మోదీతో కలిసిపోయే ప్రమాదముందని, మైనారిటీలు అప్రమత్తంగా ఉండాలన్నారు. దేశంలో, రాష్ట్రంలో దళితులకు అన్యాయం జరుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్‌లో అన్నారు. సీఎం కేసీఆర్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులు, మంత్రులు దళిత వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కేసీఆర్‌ వ్యతిరేక శక్తుల పునరేకీకరణ జరగాలని, అందుకు కాంగ్రెస్‌ కృషి చేస్తుందని రేవంత్‌ రెడ్డి అన్నా రు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాలను నీరుగార్చేలా కేంద్రం కుతంత్రాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలుంటాయని టీఎమ్మార్పీఎస్‌ నాయకులు హెచ్చరించారు.

Next Story