కర్నాటక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ హవా
కర్ణాటక ప్రజలు ఉప ఎన్నికల్లో జేడీఎస్-కాంగ్రెస్ కూటమికే జై కొట్టారు. కన్నడనాట బీజేపీకి మరోసారి ఎదురుదెబ్బ...
కర్ణాటక ప్రజలు ఉప ఎన్నికల్లో జేడీఎస్-కాంగ్రెస్ కూటమికే జై కొట్టారు. కన్నడనాట బీజేపీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ కంచుకోట శివమొగ్గలో తప్ప మిగతా నాలుగు చోట్ల కాంగ్రెస్-జేడీఎస్ కూటమి సత్తా చాటింది. రికార్డు మెజార్టీతో సీఎం కుమారస్వామి భార్య గెలుపుతో కర్ణాటక ఉపఎన్నిల్లో బీజేపీకి చావుదెబ్బ పడింది. కాంగ్రెస్-జేడీఎస్ కూటమి వ్యూహం ముందు కాషాయపార్టీ కూలబడింది. మూడు లోక్‌సభ, రెండు శాసనసభ స్థానాలు సహా మొత్తం ఐదు స్థానాల్లో జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి నెగ్గాయి. సీఎం కుమారస్వామి రాజీనామాతో ఖాళీ అయిన రామనగరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన భార్య అనితాకుమారస్వామి ఘన విజయం సాధించారు. ఆమె లక్షా 9వేల 137 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో జేడీఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరీకరించేందుకు ప్రయత్నించేవారికి ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు అని సీఎం కుమారస్వామి అన్నారు. తాజా ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఉపఎన్నికలు జరిగిన ఐదు స్థానాల్లో నాలుగు చోట్ల బీజేపీ ఘోర పరాజయం పొందడంతో ఆ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద సందడి లేక వెలవెలబోయింది. వచ్చే ఏడాది ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉన్న బీజేపీకి తాజా ఎన్నికల ఫలితాలు కోలుకోలేని షాక్ ఇచ్చినట్టు కనిపిస్తోంది.
Bandi Sanjay: డీజీపీకి డెడ్‌లైన్ విధించిన బండి సంజయ్
15 Aug 2022 9:19 AM GMTతెలంగాణ భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన కే.కేశవరావు
15 Aug 2022 8:15 AM GMTగోల్కొండ కోట వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
15 Aug 2022 6:33 AM GMTచిరంజీవి బ్లడ్ బ్యాంకులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 6:17 AM GMTమంగళగిరిలోని జనసేన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 4:49 AM GMT75th Independence Day: తెలంగాణలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 2:52 AM GMTFreedom Rally: పోలీసుల తుపాకీ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్
13 Aug 2022 10:37 AM GMT
మరింత వేడెక్కుతున్న మునుగోడు పాలిటిక్స్
16 Aug 2022 5:04 AM GMTవరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్న సీఎల్పీ బృందం
16 Aug 2022 4:06 AM GMTనంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం
16 Aug 2022 3:51 AM GMTరిషి సునాక్ కు వ్యతిరేక పవనాలు
16 Aug 2022 3:34 AM GMTఇవాళ రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం
16 Aug 2022 3:09 AM GMT