కాంగ్రెస్‌.. ఫస్ట్‌ బ్యాచ్‌

కాంగ్రెస్‌.. ఫస్ట్‌ బ్యాచ్‌
x
Highlights

తెలంగాణ కాంగ్రెస్ జోరు పెంచింది. అభ్యర్దుల మొదటి లిస్టును విడుదల చేయడానికి సిద్దమవుతోంది. ఒకటి రెండు రోజుల్లో అభ్యర్ధుల జాబితాను విడుదల చేసేందుకు...

తెలంగాణ కాంగ్రెస్ జోరు పెంచింది. అభ్యర్దుల మొదటి లిస్టును విడుదల చేయడానికి సిద్దమవుతోంది. ఒకటి రెండు రోజుల్లో అభ్యర్ధుల జాబితాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కోర్ కమిటీ కీలక మీటింగ్ తర్వాత ఈ విషయమై ఓ స్పష్టత రానుంది. తెలంగాణ కాంగ్రేస్ ముందస్తూ ఎన్నికల ప్రచారంలో దూకడానికి సన్నదం అవుతోంది. కనీసం అభ్యర్దులను ప్రకటించకుండా ప్రచారం చేయడం సాధ్యం కాదని భావిస్తున్న హస్తం పార్టీ మొదటి లిస్టు విడుదలకు సన్నాహాలు చేస్తుంది. రానున్న రెండు రోజుల్లో మంచి ముహూర్తం ఉండడంతో అభ్యర్దుల మొదటి లిస్టు రిలీజ్ సన్నహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కూటమిలో ఇబ్బందిలేని స్థానాల పై మొదటి లిస్టు అభ్యర్ధులు పేర్లు ఉండేలా ప్లాన్ చేస్తోంది.

సిట్టింగ్ స్థానాలను కాంగ్రెస్ మొదటి లిస్టులో చేర్చడానికి సిద్దమయినట్లు తెలుస్తోంది. అందుకు సీనియర్లు సిట్టింగ్ లతో మొదటి లిస్టు దాదాపు 40 పేర్లతో విడుదల చేయడానికి అధిష్టానం వద్ద గ్రీన్ సిగ్నల్ తీసుకున్నట్లు తెలుస్తోంది. మొదటి లిస్టు పై చర్చించేందుకు అక్టోబర్ 3న పార్టీ కోర్ కమిటి భేటి కాబోతుంది. కోర్ కమిటిలో కూటమిలో భాగస్వామ్యపక్షాలకు అభ్యంతరం లేని స్థానాలను మొదటి లిస్టులో చేర్చాలని భావిస్తోంది. మంగళవారం జరిగిన మహా కూటమి చర్చల్లో మొదటి లిస్టులో ప్రకటించే స్థానాల పై కాంగ్రెస్ పార్టీ చర్చించినట్లు తెలుస్తోంది.

ఒకటి రెండు రోజుల్లో కాంగ్రెస్ మొదటి జాబితాను ప్రకటించాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొదటి విడతలో 35 నుంచి 40 సీట్ల వరకు ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ ప్రకటించాలనుకుంటున్న సీట్లు గురించి గాంధీభవన్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

1.మ‌ర్రిశ‌శిధ‌ర్ రెడ్డి -స‌న‌త్ న‌గ‌ర్. 2. జీవ‌న్ రెడ్డి -జ‌గిత్యాల‌. 3.శ్రీధ‌ర్ బాబు -మంథ‌ని. 4.ఎ.లక్ష్మ‌న్ కుమార్ -ధ‌ర్మ‌పురి. 5.ఆరెప‌ల్లి మోహ‌న్ -మాన‌కొండూరు. 6.భ‌ట్టి విక్ర‌మార్క -మ‌థిర‌. 7.రేవంత్ రెడ్డి -కొడంగ‌ల్. 8.చిన్నారెడ్డి -వ‌న‌ప‌ర్తి. 9. డి.కె అరుణ‌-గ‌ద్వాల‌. 10.సంప‌త్ కుమార్- అలంపూర్. 11. వంశీచంద‌ర్ రెడ్డి -క‌ల్వ‌కుర్తి. 12. రామ్మోహ‌న్ రెడ్డి -ప‌రిగి. 13. స‌బిత ఇంద్రారెడ్డి -మ‌హేశ్వ‌రం. 14. ప్ర‌తాప్ రెడ్డి -షాద్ న‌గ‌ర్. 15.మ‌హేశ్వ‌ర్ రెడ్డి -నిర్మ‌ల్. 16. దామోద‌ర్ రాజ‌న‌ర్సింహ -ఆంథోల్. 17. సునితా ల‌క్ష్మారెడ్డి -నర్సాపూర్. 18.గీతారెడ్డి -జ‌హీరాబాద్. 19. జ‌గ్గారెడ్డి -సంగారెడ్డి. 20. ప్ర‌తాప్ రెడ్డి -గ‌జ్వేల్. 21. కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి -న‌ల్గొండ‌. 22. దామోద‌ర్ రెడ్డి -సూర్యాపేట్. 23. జానారెడ్డి-నాగార్జున సాగ‌ర్. 24. ఉత్త‌మ్ కుమార్ రెడ్డి -హుజూర్ న‌గ‌ర్. 25. ప‌ద్మావ‌తి -కోదాడ‌. 26. భిక్ష‌మ‌య్య గౌడ్ -ఆలేర్. 27. సుద‌ర్శ‌న్ రెడ్డి -బోధ‌న్. 28. ష‌బ్బీర్ అలీ -కామారెడ్డి. 29. అనిల్ -బాల్కొండ‌. 30. పొన్నాల ల‌క్ష్మ‌య్య -జ‌న‌గాం. 31.గడ్డం ప్రసాద్- వికారాబాద్. 32. దొంతి మాధ‌వ‌రెడ్డి -న‌ర్సంపేట్. 33. గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి -భూపాల‌ప‌ల్లి. 34. సీత‌క్క -ములుగు. 35. మల్ రెడ్డి రంగారెడ్డి- ఇబ్రహీం పట్నం. 36. ఎల్.బి.నగర్- సుధీర్ రెడ్డి. 37. ఆది శ్రీనివాస్- వేములవాడ. 38. నాగం జనార్దన్ రెడ్డి- నాగర్ కర్నూల్. 39. విష్ణువర్ధన్ రెడ్డి- జూబ్లీహిల్స్.

ఎన్నికల ప్రచారంలో దూసుకుపోవడం కోసం అభ్యర్దులో ప్రకటన తప్పనిసరి కావడంతో అత్యసవరంగా మొదటి లిస్టు ప్రకటనకు కాంగ్రెస్ సన్నాహాలు చేస్తోంది. మొదటి లిస్టు ప్రకటనతో రెండో లిస్టు విడుదలకు పార్టీలో వత్తిడి పెరిగే అవకాశముంది. పార్టీలో ఎలాంటి వత్తిడి రాకముందే కూటమి సర్దుబాట్లు పూర్తి చేసుకొని మొత్తం అభ్యర్దులను ప్రకటన చేయాలని పార్టీ భావిస్తంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories