Top
logo

ఢిల్లీకి అసమ్మతి సెగలు

X
Highlights

కాంగ్రెస్‌ నేతల నిరసనలతో ఢిల్లీ మార్మోగుతోంది.తెలంగాణ భవన్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద కాంగ్రెస్‌ ఆశావహులు...

కాంగ్రెస్‌ నేతల నిరసనలతో ఢిల్లీ మార్మోగుతోంది.తెలంగాణ భవన్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద కాంగ్రెస్‌ ఆశావహులు ఆందోళనకు దిగారు. సీట్ల కేటాయింపుల్లో బీసీలకు అన్యాయం జరుగుతోందని నిరసనకు దిగారు. ఈ నిరసన కార్యక్రమంలో నల్గొండ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ శ్రీనివాస్‌యాదవ్‌, ఓబీసీ సెల్‌ కన్వీనర్‌ అశోక్‌గౌడ్‌, పీసీసీ మాజీ కార్యదర్శి రాపోలు జయప్రకాశ్‌, యూత్‌ కాంగ్రెస్‌ స్టేట్‌ జనరల్‌ సెక్రటరీ సతీష్‌గౌడ్‌ పాల్గొన్నారు. బీసీలకు 40 సీట్లు, బీసీ నేతలకే సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 4శాతం ఉన్న సామాజిక వర్గానికి 40కిపైగా సీట్లు ఇచ్చారని ఆరోపించిన నేతలు 60శాతం ఉన్న బీసీలకు తగినన్ని సీట్లు ఇవ్వలేదని విమర్శించారు.

Next Story