ఆ సమయంలో ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తా : కుమారస్వామి

nanireddy
Updated on: 24 Dec 2018 1:33 PM IST
ఆ సమయంలో ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తా : కుమారస్వామి
X

నాటకీయ పరిణామాల మధ్య ఇటీవల కర్ణాటకగా ముఖ్యమంత్రిగా ఎన్నికైన కుమారస్వామి సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ తొలిప్రధాని జవహర్ లాల్ నెహ్రు వర్ధంతి సందర్బంగా నివాళులు అర్పించిన అయన తనకు ముఖ్యమంత్రి పదవి కర్ణాటక ప్రజలు ఇచ్చింది కాదని.. కాంగ్రెస్ ఇచ్చిందని, ఆ పార్టీ ఏ విధంగా చెబితే ఆ విధంగా నడుచుకుంటానని అన్నారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రుణమాఫీ హామీని అమలుచేస్తానని, రుణమాఫీ చెయ్యకపోయినా.. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినా.. ఆ మరుక్షణమే ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. నిన్నటిదాకా పాత కుమారస్వామిని చూసిన ప్రజలు ఇకపై నూతన కుమారస్వామిని చూస్తారని అన్నారు. కాగా వచ్చే ఎన్నికల్లో పొత్తులపై స్పష్టత ఇవ్వని తన తండ్రి నిర్ణయం ప్రస్తుత నిర్ణయానికంటే బిన్నంగా ఉండబోదని అన్నారు.

nanireddy

nanireddy

Next Story