logo
సినిమా

పెళ్ళి పీట‌లెక్క‌బోతున్న యువ కమెడియన్‌..!

పెళ్ళి పీట‌లెక్క‌బోతున్న యువ కమెడియన్‌..!
X
Highlights

సైన్మా అనే షార్ట్ ఫిలింతో అంద‌రి దృష్టిలో ప‌డి ఆ త‌ర్వాత అర్జున్‌ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో స్టార్‌ ఇమేజ్‌ ...

సైన్మా అనే షార్ట్ ఫిలింతో అంద‌రి దృష్టిలో ప‌డి ఆ త‌ర్వాత అర్జున్‌ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో స్టార్‌ ఇమేజ్‌ అందుకున్న కమెడియన్‌ రాహుల్ రామకృష్ణ. డిఫరెంట్ డైలాగ్‌ డెలివరీ లుక్‌తో ఆకట్టుకుంటున్న ఈ యువ నటుడు త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ విషయాన్ని కూడా తనదైన స్టైల్‌లో సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు రాహుల్. త‌న‌కి కాబోయే భార్యా తో బీచ్ ప‌క్క‌న ఫోటో దిగిన రాహుల్ రామ‌కృష్ణ ఆ ఫోటోని ట్విట్ట‌ర్‌లో షేర్ చేస్తూ .. ‘జనవరి 15న నేను పెళ్లి చేసుకోబోతున్నాను. ఎవరికీ చెప్పకండి’ అంటూ కామెంట్‌ చేశాడు.

Next Story