పెళ్లిపీటలెక్కనున్న స్టార్ కమెడియన్!

స్టార్ కమెడియన్, బాలీవుడ్ నటుడు కపిల్ శర్మ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నాడు. డిసెంబరులో తన గర్ల్‌ఫ్రెండ్ ...
స్టార్ కమెడియన్, బాలీవుడ్ నటుడు కపిల్ శర్మ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నాడు. డిసెంబరులో తన గర్ల్‌ఫ్రెండ్ జిన్నీని కపిల్ వివాహమాడనున్నట్లు అతడి సన్నిహితులు మీడియాకు తెలిపారు. ఆయన కొన్నాళ్ళుగా గిన్నీ ఛత్రాత్‌తో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు. డిసెంబర్‌లో పంజాబీ సంప్రదాయం ప్రకారం వీరి పెళ్ళి జరగనున్నట్టు తెలుస్తుంది. నాలుగు రోజుల పాటు అమృత్ సర్‌లో ఈ పెళ్లి వేడుక జరగనున్నట్టు సమాచారం. వీరి వివాహానికి బాలీవుడ్‌కి సంబంధించిన నటీనటులు హాజరు కానున్నారని సమాచారం. అలాగే ముంబైలో తన సన్నిహితులు, కొందరు స్టార్స్‌కి కపిల్ భారీ పార్టీ ఏర్పాటు చేయనున్నాడని అంటున్నారు. కాగా ‘కామెడీ నైట్స్ విత్ కపిల్’ షోతో ఫేమస్ అయిన కపిల్ శర్మ స్టార్ కమెడియన్‌గా గుర్తింపు పొందాడు. ఒక షోకు అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న కమెడియన్‌గా కూడా రికార్డు సృష్టించాడు. పలు బాలీవుడ్ సినిమాలలో కూడా నటించిన కపిల్.. ‘సన్ ఆఫ్ మంజీత్ సింగ్’ అనే సినిమాతో నిర్మాతగా మారాడు. ఈ సినిమా అక్టోబరు 12న విడుదల కానుంది. ఇక జిన్నీతో తనకున్న అనుబంధాన్ని 2017లో ట్విటర్ వేదికగా కన్ఫామ్ చేసిన కపిల్ త్వరలోనే ఆమెను పెళ్లాడనున్నాడు.
రాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్‌లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT
నిఖత్ జరీన్‌కు హైదరాబాద్ లో ఘన స్వాగతం
27 May 2022 4:00 PM GMTముగిసిన కేటీఆర్ దావోస్ టూర్.. తెలంగాణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు..
27 May 2022 3:45 PM GMTLPG Subsidy: గ్యాస్ వినియోగదారులకి అలర్ట్.. అకౌంట్లో సబ్సిడీ చెక్...
27 May 2022 3:30 PM GMTనారా లోకేష్ సంచలన నిర్ణయం.. వాళ్లకు నో టికెట్స్.. నేనూ పదవి నుంచి...
27 May 2022 3:30 PM GMTWrinkles: 30 ఏళ్ల తర్వాత ముడతలు రావొద్దంటే ఈ చిట్కాలు పాటించండి..!
27 May 2022 2:30 PM GMT