logo
సినిమా

`క‌ల‌ర్స్‌` స్వాతి పెళ్లి ఫిక్స్‌...వరుడు ఎవరంటే!

`క‌ల‌ర్స్‌` స్వాతి పెళ్లి ఫిక్స్‌...వరుడు ఎవరంటే!
X
Highlights

టీవీ యాంకర్‌గా పేరు తెచ్చుకుని, సినిమాల్లో కూడా మంచి గుర్తింపు పొందిన ‘కలర్స్’స్వాతి పెళ్లి కూతురు అవుతోంది....

టీవీ యాంకర్‌గా పేరు తెచ్చుకుని, సినిమాల్లో కూడా మంచి గుర్తింపు పొందిన ‘కలర్స్’స్వాతి పెళ్లి కూతురు అవుతోంది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది స్వాతి. ఆగస్టు 30 వ తేదీ రాత్రి 7:33కు స్వాతి వివాహం జరగనున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ వేదికగానే పెళ్లి జరగబోతోంది. ఇంతకీ వరుడు ఎవరంటే.. అతడి పేరు వికాస్. అతడొక పైలెట్ అని తెలుస్తోంది. వికాస్‌ మలేసియన్‌ ఎయిర్‌లైన్స్ లో పైలట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వికాస్‌ స్వస్థలం ఇండోనేషియా రాజధాని జకార్తా. వివాహం తర్వాత స్వాతి తన భర్తతో కలిసి అక్కడే స్థిరపడనున్నారు. ‘కలర్స్‌’ టీవీ షో ద్వారా స్వాతి బుల్లితెరకు పరిచయమయ్యారు. దాంతో ఆమె ‘కలర్స్‌’ స్వాతిగా సుపరిచితురాలు అయ్యారు. ఆ తర్వాత 2005లో వచ్చిన ‘డేంజర్‌’ చిత్రంతో నటించారు. ఆ తర్వాత ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’, ‘అష్టాచెమ్మా’, ‘స్వామిరారా’, ‘కార్తికేయ’, ‘త్రిపుర‘ తదితర చిత్రాల్లో నటించారు. కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరిద్ద‌రూ పెద్ద‌ల అనుమ‌తితో ఈ నెల 30వ తేదీన పెళ్లి చేసుకోబోతున్న‌ట్టు స‌మాచారం. ఆ త‌ర్వాత రిసెప్ష‌న్ కూడా ఏర్పాటు చేయ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది.

Next Story