చలితో విద్యుత్ సంస్థలకు మేలు

x
Highlights

చలి తీవ్రత పెరగడంతో విద్యుత్‌ పంపిణీ సంస్థలకు ఆర్థికంగా మేలు చేకూరుతోంది. ఈ నెలలో కరెంటు రోజువారీ డిమాండ్‌ గణనీయంగా తగ్గింది. రోజువారీ అత్యధిక డిమాండు...

చలి తీవ్రత పెరగడంతో విద్యుత్‌ పంపిణీ సంస్థలకు ఆర్థికంగా మేలు చేకూరుతోంది. ఈ నెలలో కరెంటు రోజువారీ డిమాండ్‌ గణనీయంగా తగ్గింది. రోజువారీ అత్యధిక డిమాండు ఈ నెల 21వ తేదీన 8,502 మెగావాట్లుగా నమోదైంది. గతేడాది డిసెంబరు 21న అత్యధిక డిమాండు 8,508 మెగావాట్లు ఉండగా డిసెంబరు నెల మొత్తమ్మీద గతేడాదికన్నా తక్కువగా ఉంది. గత జనవరి ఒకటి నుంచి వ్యవసాయానికి 24 గంటలూ విద్యుత్‌ సరఫరా ప్రారంభించిన తర్వాత ఇలా ఒక నెలలో గతేడాది అత్యధిక డిమాండును మించకపోవడం గత 12 నెలల్లో ఇదే తొలిసారి.

రాష్ట్రంలో చలి తీవ్రత పెరగడం, వర్షాల వల్ల గృహ, వ్యవసాయ విద్యుత్‌ వినియోగం బాగా పడిపోయింది. యాసంగి పంటల సాగు నత్తనడకన సాగుతోంది. మొత్తం 31 జిల్లాలకు గాను 18 జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులున్నాయి. బోర్లలో భూగర్భ జలాలు తగ్గడం వల్ల కరెంటు వినియోగం తక్కువగా ఉన్నట్లు విద్యుత్‌ అధికారులు చెబుతున్నారు. రోజువారీ డిమాండు తగ్గినందున కరెంటు కొనుగోలు తగ్గి డిస్కంలకు ఆర్థికంగా కొంత వెసులుబాటు కలుగుతోంది.

సింగరేణి విద్యుత్‌ ప్లాంట్లలో వార్షిక మరమ్మతు పనుల కోసం ఉత్పత్తి నిలిపివేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని మార్వా ప్లాంట్లకు బొగ్గు కొరత కారణంగా విద్యుదుత్పత్తి తక్కువగా ఉందని అక్కడి అధికారులు తెలిపారు. మార్వా నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ తెలంగాణకు రోజూ రావాలి. కానీ ఒక్కోరోజు 500 మెగావాట్లలోపే వస్తోంది. జాతీయ స్థాయిలో పలు థర్మల్‌ కేంద్రాలకు బొగ్గు కొరత ఉందని, తెలంగాణలో సింగరేణి గనులున్నందున ఆ సమస్య లేదంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories