‘కంటి వెలుగు’ పథకాన్ని ప్రారంభించిన కేసీఆర్

‘కంటి వెలుగు’ పథకాన్ని ప్రారంభించిన కేసీఆర్
x
Highlights

సీఎం కేసీఆర్ కొద్దిసేపటి క్రితం తూప్రాన్ మండలం మల్కాపూర్ చేరుకున్నారు. మల్కాపూర్‌లో సీఎం ‘కంటి వెలుగు’ పథకాన్ని ప్రారంభించారు. కంటి పరీక్షలు...

సీఎం కేసీఆర్ కొద్దిసేపటి క్రితం తూప్రాన్ మండలం మల్కాపూర్ చేరుకున్నారు. మల్కాపూర్‌లో సీఎం ‘కంటి వెలుగు’ పథకాన్ని ప్రారంభించారు. కంటి పరీక్షలు చేయించుకున్న ఓ మహిళకు సీఎం కంటి అద్దాలు అందజేశారు. కంటి పరీక్షల గురించి సీఎం వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను సీఎం పరిశీలించారు. కంటి చూపును నిర్లక్ష్యం చేస్తూ దృష్టిలోపంతో బాధపుడుతున్న వివిధ వయస్సులకు చెందిన తెలంగాణ ప్రజలకు కంటివెలుగును అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ చరిత్రాత్మక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా నిర్వహించే కంటి పరీక్షలు, కంటి అద్దాలు, అవసరమైన వారికి జరిపే కంటి శస్త్ర చికిత్సలు, మందులు తదితరాలు ప్రభుత్వ ఖర్చుతో పూర్తి ఉచితంగా అందజేయనుంది. కంటిని కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కంటి ఆరోగ్యానికి సంబంధించిన అవగాహనను కూడా కంటి వెలుగు కార్యక్రమ నిర్వహణ సందర్భంగా కల్పించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories