logo
జాతీయం

అవిశ్వాస తీర్మానం.. మేం మద్దతివ్వం..

అవిశ్వాస తీర్మానం.. మేం మద్దతివ్వం..
X
Highlights

గత పార్లమెంటు సమావేశాల్లో అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టకుండా కావేరీ జలాల పేరుతో అన్నా డీఎంకే అనుక్షణం సభను...

గత పార్లమెంటు సమావేశాల్లో అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టకుండా కావేరీ జలాల పేరుతో అన్నా డీఎంకే అనుక్షణం సభను అడ్డుకున్న సంగతి తెలిసిందే. బీజేపీ కనుసన్నల్లో మెలుగుతూ అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా విజయవంతంగా తన పాత్రను పోషించిందనే ప్రచారం కూడా జరిగింది. ఎన్‌డీఏ ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం శుక్రవారం చర్చకు రానుంది. టీడీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వడం లేదని తమిళనాడు సీఎం ఎడపాడి పళనిస్వామి స్పష్టం చేశారు. కావేరి జలాలపై మా పార్టీ చేసిన పోరాటానికి ఏ పార్టీ మద్దతివ్వలేదని సీఎం ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేశారు. అందుకే అవిశ్వాసానికి మద్దతు ఇవ్వడం లేదని సీఎం పళని స్వామి పేర్కొన్నారు.

Next Story