హరీశ్‌రావును లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలి

హరీశ్‌రావును లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలి
x
Highlights

ఇవాళ మధ్యాహ్నం నామినేషన్ వేయబోతున్న సీఎం కేసీఆర్ గజ్వేల్ దగ్గర కోనాయిపల్లి వెంకన్న స్వామిని దర్శించుకున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ నామినేషన్‌ దాఖలు చేసే...

ఇవాళ మధ్యాహ్నం నామినేషన్ వేయబోతున్న సీఎం కేసీఆర్ గజ్వేల్ దగ్గర కోనాయిపల్లి వెంకన్న స్వామిని దర్శించుకున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ నామినేషన్‌ దాఖలు చేసే ముందు కోనాయిపల్లి వెంకన్నను కేసీఆర్‌ దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ మధ్యాహ్నం కోనేటి రాయుడి ఆలయానికి చేరుకున్న కేసీఆర్‌కు అర్చకులు స్వాగతం పలికారు. తర్వాత స్వామివారిని దర్శించుకున్న కేసీఆర్‌ నామినేషన్‌ పత్రాలను స్వామివారి పాదాల చెంత ఉంచారు. కేసీఆర్‌తో పాటు మంత్రి హరీశ్‌రావు వెంకన్నను దర్శించుకున్నారు.

అనంతరం కోయినాపల్లి గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్‌ కష్టాలు పోయాయని, రైతులకు సరిపోయినంతగా కరెంట్‌ ఇస్తున్నామని చెప్పారు. వెంకన్న దయవల్ల వచ్చే ఏడాది కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. ఆ ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసుకొచ్చి స్వామివారి పాదాలు కడుగుతామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొద్దికాలంలోనే ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. తాను ఎంత ఉన్నతస్థాయికి వెళ్లినా తన మూలాలు ఇక్కడే ఉంటాయన్నారు. స్థానిక టీఆర్ఎస్ అభ్యర్థి హరీశ్‌రావును లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కేసీఆర్‌ కోరారు.

1985 నుంచి ప్రతి ఎన్నిక సందర్భంగా కేసీఆర్‌ కోనాయిపల్లికి వచ్చి వెంకటేశ్వరస్వామికి పూజలు చేశాకే నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని చేపట్టినప్పుడు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశాకనే టీఆర్‌ఎస్ ఆవిర్భావాన్ని ప్రకటించారు. అప్పటి నుంచి ఇదే సెంటిమెంట్‌ను కేసీఆర్‌ కొనసాగిస్తున్నారు. 2004లో కేసీఆర్‌ ఇక్కడి నుంచి గెలుపొందిన తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ ఏడాది జరిగిన ఉప ఎన్నికలో ఇక్కడి నుంచి పోటీ చేసిన హరీశ్‌ కూడా ఇదే సంప్రదాయాన్ని పాటిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories