ప్రాజెక్టు పనుల్లో ఇంత జాప్యమా?

ప్రాజెక్టు పనుల్లో ఇంత జాప్యమా?
x
Highlights

కోటి ఎకరాలకు సాగునీరు అందించేలా రాష్ట్రంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు రెండేళ్లలో పూర్తి చేయాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. సీతారామ,...

కోటి ఎకరాలకు సాగునీరు అందించేలా రాష్ట్రంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు రెండేళ్లలో పూర్తి చేయాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. సీతారామ, శ్రీరామ సాగర్ పునరుజ్జీవం పథకం పనులు మందకొడిగా నడుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసిన సిఎం వర్క్ ఏజన్సీలతో, సంబంధిత అధికారులతో మాట్లాడి, సత్వరం పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం బ్యారేజిలను, పంపుహౌజు పనులను కేసీఆర్ స్వయంగా పరిశీలించనున్నారు. ప్రాజెక్టుల నిర్మాణాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం మందగించిన పనులపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రగతిభవన్‌లో ప్రాజెక్టులపై సమీక్షా సమావేశం నిర్వహించిన కేసీఆర్‌ సేకరించిన భూములకు సంబంధించిన పరిహారం వెంటనే చెల్లించాలని ఆదేశించారు. గంధమల్ల, బస్వాపురం రిజర్వాయర్ల భూ నిర్వాసితులకు చెల్లించడానికి 80 కోట్ల నిధులు విడుదల చేయాలని ఆర్థికశాఖను ఆదేశించారు. భూపాలపల్లి, నిర్మల్, పెద్దపల్లి, భువనగిరి జిల్లాల కలెక్టర్లకు కూడా వెంటనే పరిహారానికి సంబంధించిన డబ్బులు విడుదల చేయాలని కోరారు.

తెలంగాణలో ఎక్కువ భూభాగానికి నీరందించే కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో మరింత వేగం పెరగాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. వచ్చే జూన్, జూలై నాటికి నీరందించాలని తేల్చిచెప్పారు. మేడిగడ్డ బ్యారేజి నిర్మాణం అనుకున్నంత వేగంగా జరగడం లేదని అలాగే అన్నారం, సుందిళ్ల బ్యారేజిలు, పంపుహౌజుల నిర్మాణాల్లో వేగం పెరగాలని సూచించారు. కాళేశ్వరం పనుల్లో జాప్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని హెచ్చరించారు. పనులను ప్రత్యక్షంగా చూసేందుకు వచ్చే మంగళవారం ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజిలు, పంపుహౌజుల నిర్మాణ ప్రాంతాలను సందర్శిస్తానని సిఎం చెప్పారు. సింగూరుకు రెండు ఎత్తిపోతల పథకాలు నిర్మించి నారాయణఖేడ్ నియోజకవర్గానికి లక్ష, జహీరాబాద్ నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీరందరించాలని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలని సిఎం సంబంధిత అధికారులను ఆదేశించారు. కౌలాస్ నాలాను పటిష్టం చేయడంతో పాటు, నాగమడుగు పనులు చేయడం ద్వారా జుక్కల్ నియోజకవర్గానికి సాగునీరు అందించాలని చెప్పారు. మహారాష్ట్ర అధికారులతో మాట్లాడి లెండి ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని సూచించారు.

సీతారామ ఎత్తిపోతల పథకానికి అవసరమైన 11 వేల కోట్ల నిధుల సేకరణ కూడా పూర్తయిందని, పనుల్లో ఏమాత్రం జాప్యం, నిర్లక్ష్యం వహించవద్దని కేసీఆర్‌ స్పష్టం చేశారు. వర్క్ ఏజన్సీల బాధ్యులతో సీఎం స్వయంగా ఫోన్లో మాట్లాడారు. అలాగే పాలమూరు-రంగారెడ్డి, డిండి, సీతారామ, దేవాదుల ప్రాజెక్టులపై త్వరలోనే మరోసారి విస్తృత స్థాయిలో సమీక్ష నిర్వహించాలని కేసీఆర్‌ నిర్ణయించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories