Top
logo

సకాలంలో చెల్లింపులు చేసే రాష్ట్రం తెలంగాణ: సీఎం కేసీఆర్

సకాలంలో చెల్లింపులు చేసే రాష్ట్రం తెలంగాణ: సీఎం కేసీఆర్
X
Highlights

దేశంలోనే సకాలంలో చెల్లింపులు చేసే రాష్ట్రం తెలంగాణ అని అన్నారు సీఎం కేసీఆర్. అసెంబ్లీలో జరుగుతున్న ద్రవ్య...

దేశంలోనే సకాలంలో చెల్లింపులు చేసే రాష్ట్రం తెలంగాణ అని అన్నారు సీఎం కేసీఆర్. అసెంబ్లీలో జరుగుతున్న ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో కేసీఆర్‌ మాట్లాడారు. అంతకు ముందు ఇదే అంశంపై బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా.. చెల్లింపుల్లో జాప్యం జరుగుతుందని ప్రశ్నించారు. ఈ విషయంపై కలుగ చేసుకున్న సీఎం కేసీఆర్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణలో ఉన్న సిస్టం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం కారణంగానేకొన్ని రాష్ట్రాల్లో చెల్లింపుల్లో ఆలస్యం జరుగుతుందన్నారు. తెలంగాణలో చెల్లింపులు ఆగలేద ఆగవన్నారు. ప్రభుత్వంపై అనవసరంగా తప్పుడు ప్రచారం చేయడం మంచిది కాదన్నారు సీఎం కేసీఆర్.

Next Story