జవహర్‌నగర్‌ సీఐపై వేటు

జవహర్‌నగర్‌ సీఐపై వేటు
x
Highlights

హైదరాబాద్‌ జవహర్‌నగర్‌ సీఐపై బదిలీ వేటు పడింది. హైదరాబాద్ రేంజ్ డీఐజీకి రిపోర్టు చేయాలని అధికారులు ఆదేశించారు. హత్య కేసులో బాధితురాలి ఇంట్లో సీఐ...

హైదరాబాద్‌ జవహర్‌నగర్‌ సీఐపై బదిలీ వేటు పడింది. హైదరాబాద్ రేంజ్ డీఐజీకి రిపోర్టు చేయాలని అధికారులు ఆదేశించారు. హత్య కేసులో బాధితురాలి ఇంట్లో సీఐ ఉమామహేశ్వర్ అనుచితంగా వ్యవహరించారు. పోలీస్‌ అధికారి వ్యవహారశైలిపై సర్వత్రా విమర్శలు వ్యక్తకావడంతో అధికారులు వేటు వేశారు. ప్రజలతో మంచి సంబంధాలు కలిగి ఉండాలని ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వచ్చి వారితో ఫ్రెండ్లీగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పదేపదే బహిరంగసభల్లో చెబుతున్నారు. అయితే పోలీసులు సీఎం కేసీఆర్‌ మాటలను చెవికెక్కించుకోవడం లేదు. తమకు ఇష్టమొచ్చినట్లే మెనార్క్‌ల్లా వ్యవహరిస్తున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌లో అడుగు పెట్టే ముందు చెప్పులు బయట వదిలేసి రావాలంటారు. అదే పోలీసులు కేసు విచారణకు వెళ్లినపుడు మాత్రం సీఎంలు, పీఎంలు కూడా వ్యవహరించినట్లు బిల్డప్‌ ఇస్తున్నారు. జవహర్‌నగర్‌ పీఎస్‌ పరిధిలో ఓ హత్య కేసు విచారణకు ఓ ఇంటికి వెళ్లిన పోలీస్‌ అధికారి తన ఇంటిలా ఎలా కూర్చోన్నాడో చూడండి.

Show Full Article
Print Article
Next Story
More Stories