Top
logo

ఇళ్లపైన స్టార్‌ను ఎందుకు పెడతారు?

ఇళ్లపైన స్టార్‌ను ఎందుకు పెడతారు?
X
Highlights

ప్రపంచంలోనే అతిపెద్ద మతం క్రైస్తవ్యం. ప్రపంచ జనాభాలో దాదాపు మూడోవంతు ప్రజలు క్రిస్మస్ ఆరాధనల్లో పాల్గొంటారని...

ప్రపంచంలోనే అతిపెద్ద మతం క్రైస్తవ్యం. ప్రపంచ జనాభాలో దాదాపు మూడోవంతు ప్రజలు క్రిస్మస్ ఆరాధనల్లో పాల్గొంటారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా క్రీస్తు జన్మస్థలమైన బెత్లహేంలో ప్రతి ఏడాది క్రిస్మస్ వేడుకలు వైభవంగా సాగుతాయి. ప్రపంచ రోమన్ క్యాథలిక్‌ల కేంద్రమైన వాటికన్‌ సిటీలో వందలాదిమంది క్రీస్తు జన్మదినోత్సవంలో పాల్గొంటారు. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరుగుతాయి. దాదాపు ప్రతి క్రిస్టియన్ ఇంటిపైనా స్టార్ లను పెడతారు. ఇంటిని అందంగా ముస్తాబు చేస్తారు. రంగురంగుల బెలూన్లు, అలకంరణ వస్తువులతో చర్చిలను డెకరేట్ చేస్తారు. కానీ ప్రతి అలంకరణకు కారణముంది. వేడుకల్లో పరమార్థముంది. యేసు ప్రభువు బెత్లహేంలో జన్మించినప్పుడు జ్ణానులకు దారి చూపించింది ఈ నక్షత్రమే. ఎక్కడో ప్రాంతం నుంచి జ్ణానులు క్రీస్తు పుట్టిన స్థలానికి రావడానికి స్టార్ ఉపయోగపడింది. అది దేవుడు ఏర్పాటు చేసిన స్టార్ అని క్రైస్తవుల నమ్మకం. అందుకే ప్రతి ఇంటిపై స్టార్ పెడతారు. తమ ఇంట్లోనూ క్రీస్తు జన్మించాడని సూచికగా స్టార్‌ను వేలాడదీస్తారు.

Next Story