మెగా ఫ్యామిలీ లో మరొక యువరాణి

ప్రపంచం మొత్తం క్రిస్మస్ వేడుకల్లో తలమునకలై ఉంది. అయితే ఈ పండుగ రోజు మెగా ఫ్యామిలీకి మర్చిపోలేని రోజు గా...
ప్రపంచం మొత్తం క్రిస్మస్ వేడుకల్లో తలమునకలై ఉంది. అయితే ఈ పండుగ రోజు మెగా ఫ్యామిలీకి మర్చిపోలేని రోజు గా మారింది. మెగాస్టార్ చిరంజీవి రెండవ కూతురు శ్రీజ కళ్యాణ్ దేవ్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలల ముందే శ్రీజ గర్భవతి అని కళ్యాణ్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఇవాళ పొద్దున శ్రీజ ఆడపిల్లకు జన్మమిచ్చింది. అంటే మెగా ఫామిలీ లోకి మరొక బుల్లి యువరాణి విచ్చేసిందన్న మాట. ఈవార్త తో మెగా ఫ్యామిలీ మాత్రమే కాక మెగా ఫ్యాన్స్ కూడా సంతోషంలో వేడుకలు చేస్తున్నారు.
ఈ విషయాన్ని ఫ్యాన్స్ తో పంచుకుంటూ, "ఇప్పటికే గుర్తుండిపోయే క్రిస్మస్ ఇది. ఇవాళ పొద్దునే పండంటి ఆడపిల్ల పుట్టింది. అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు" అని పోస్ట్ చేశాడు కళ్యాణ్ దేవ్. శ్రీజకు ఇంతకుముందే ఇప్పటికే నివృత్తి అని ఒక పాప ఉన్న విషయం తెలిసిందే. ఈ మధ్యనే 'విజేత' సినిమాతో హీరోగా టాలీవుడ్ కి పరిచయమైన కళ్యాణ్ మొదటి సినిమాతో పెద్దగా మెప్పించలేకపోయాడు. ప్రస్తుతం పులి వాసు దర్శకత్వంలో తన రెండవ సినిమాలో నటించబోతున్నాడు.రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా టైటిల్, హీరోయిన్ మరియు ఇతరత్రా వివరాల గురించి ఇంకా తెలియాల్సి ఉంది.
రాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT
ముగిసిన కేటీఆర్ దావోస్ టూర్.. తెలంగాణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు..
27 May 2022 3:45 PM GMTLPG Subsidy: గ్యాస్ వినియోగదారులకి అలర్ట్.. అకౌంట్లో సబ్సిడీ చెక్...
27 May 2022 3:30 PM GMTనారా లోకేష్ సంచలన నిర్ణయం.. వాళ్లకు నో టికెట్స్.. నేనూ పదవి నుంచి...
27 May 2022 3:30 PM GMTWrinkles: 30 ఏళ్ల తర్వాత ముడతలు రావొద్దంటే ఈ చిట్కాలు పాటించండి..!
27 May 2022 2:30 PM GMTఉక్రెయిన్ కథ ముగిసిపోయిందంటున్న రష్యా.. పుతిన్ తర్వాతి టార్గెట్ ఆ...
27 May 2022 2:00 PM GMT