కాంగ్రెస్‌ పార్టీకి దూరంగా చిరంజీవి

కాంగ్రెస్‌ పార్టీకి దూరంగా చిరంజీవి
x
Highlights

మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని చిరంజీవి పునరుద్ధరించుకోలేదు. పార్టీలో జరుగుతున్న...

మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని చిరంజీవి పునరుద్ధరించుకోలేదు. పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాల వల్లే కాంగ్రెస్‌కు చిరు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల చిరంజీవి కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వ కాలపరిమితి ముగియగా.. దాన్ని పునరుద్ధరించుకోలేదు. దీంతో ఆయన ఆ పార్టీకి దూరమైనట్లేనని తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున పార్టీలో క్రియాశీలకంగా ఉండాలని ఇటీవల రాహుల్‌గాంధీ.. చిరంజీవిని కోరినట్లు తెలుస్తోంది. దీనికి ఆయన నుంచి స్పందన లేనట్లు సమాచారం. దీంతో ఆయన కాంగ్రెస్‌ పార్టీకి ఇక దూరమైనట్లేనని భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories